Friday, May 17, 2024

74 ఏళ్ల రాజ్యాంగం.. జయహో భారత్‌…

తప్పక చదవండి
  • రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక

సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన మన భారతదేశం. ఎం దరో స్వాతంత్య్రసమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్‌గా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతం త్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండాలి. రాజ్యాంగం అంటే దేశా నికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజా స్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి. భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చింది 1947 ఆగస్ట్‌ 15న. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యా వేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యా ంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమంటే అంత సులువు కాదు. అందుకే రెండేళ్లకు పైనే సమయం పట్టింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలోని డ్రాఫ్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణ తంత్ర దినోత్సవం జరుపుకొం టారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిరది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు. అంటే 1949 నవంబర్‌ 26న.1949 నవంబర్‌ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా… రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొద లైంది. ప్రతీ ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపు కోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్‌ 19న గెజిట్‌ నోటిఫి కేషన్‌ విడుదల చేసింది. రాజ్యాం గాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేం ద్రప్రసాద్‌ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమో దించిన తర్వాత జాతీయ గీతం ‘జనగణ మన’ ను స్వాతంత్య్ర సమరయో ధురాలు పూర్ణిమాబెనర్జీ ఆలపించారు. 1949 నవం బర్‌ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్రపడినా రాజ్యాంగ దినోత్స వం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భార త ప్రభుత్వం 2015 నవంబర్‌ 19న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాజ్యాంగం గొప్ప దనాన్ని తెలిపే ప్రసంగాలు, ఉపన్యా సాలు, వ్యాసరచన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వాఫీ సుల్లో నిర్వ హించాలని సూచిం చింది. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవం బర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపు కొంటున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్‌ దివస్‌ అని కూడా పిలుస్తారు.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదే రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రాయ్‌ జాదా.. ఇటాలిక్‌ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు. ప్రతి పేజీనీ కొందరు కళా కారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో చేతిరా తతో రాశారు. భారత దేశ ప్రజలమైన మేము అనే ప్రవేశి కతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమ ల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్ల, 8 షెడ్యూళ్లు, 22భాగాలుగా ఉంది. ప్రస్తుతం భారతరాజ్యాంగం25 భాగా లు, 12షెడ్యూల్‌లలో 448ఆర్టికల్‌ లను కలిగిఉంది. 105సవరణలు చేసింది, రాజ్యాంగం మూల ప్రతుల ను దిల్లీలో ఉన్న పార్లమెంటు భవనం లోని గ్రం థాలయంలో చూడొచ్చు. వీటిని హీలి యం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు.లిఖిత, అతిపెద్ద, సుదీర్ఘ రాజ్యాంగం: ప్రపం చంలో ప్రస్తుతమున్న అతి చిన్న రాజ్యా ంగం అమెరికా రాజ్యాం గం. అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్‌ చిహ్నం: ఏనుగు హెచ్‌వీ కామత్‌ భారత రాజ్యా ంగాన్ని దేవేంద్రుని ఐరావతంతో పోల్చాడు.భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత అని గ్రాన్‌ విల్లే ఆస్టిన్‌ వివరించాడు. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందిం చిందని చెప్పడానికి నేను గర్విస్తున్నానని డా. బీఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నాడు. భారతదేశంలోని అన్ని వర్గాల ప్రయోజ నాలను రాజ్యాంగంలో పొందుపర్చడం వల్ల భారత రాజ్యాంగం సువిశాల రాజ్యాంగంగా ఆవిర్భవించిందని ఐవర్‌ జెన్నింగ్‌ తెలిపాడు.భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా సుదర్ఘీమైన, సువిస్తారమైన రాజ్యాంగం – అని ఐవర్‌ జెన్నింగ్స్‌ వివరించాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు