Tuesday, May 14, 2024

బర్రెలక్కపై దాడి..

తప్పక చదవండి
  • కొల్లాపూర్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా శిరీష
  • కొల్లాపూర్‌ లో హై టెన్షన్‌ వాతావరణం
  • బర్రెలక్కతో పాటు ఆమె ఆమె సోదరుడిపై దాడి
  • నిరుద్యోగుల కోసం పోరాడేందుకు వస్తే దాడి
  • స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అనుచరులతో ధర్నా
  • ఇప్పటి వరకు తనకు ఎన్నో బెదిరింపు కాల్స్‌
  • చంపడానికి ప్రయత్నిస్తున్నారు : అభ్యర్థి శిరీష

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి బర్రెలక్క (శిరీష) పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై తనదైన శైలిలో అధికార పార్టీ ఫై విమర్శలు గుప్పించి సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫేమస్‌ అయిన బర్రెలక్క..ఇప్పుడు తెలంగాణ ఎన్నికల దంగల్‌ లో బరిలోకి నిలిచిన సంగతి తెలిసిందే. మహబూబ్‌ నగర్‌లోని కొల్లాపూర్‌ నియోజకవర్గం నుండి బర్రెలక్క పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో శిరీష నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం బర్రెలక్క కొల్లాపూర్‌ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె ఆమె సోదరుడిపై దాడి చేశారు. దీంతో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..

ఓట్లు చీల్చుతాననే భయంతోనే తనపై దాడి చేశారని అన్నారు. తనపై దాడి చేసింది ఏ పార్టీ వారో తెలిదయన్నారు. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అనేవారు.. కానీ తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడాటానికి వస్తే.. తనపై ఇలా దాడులు చేస్తున్నారని ఆమె బోరున విలపించారు. ఇప్పటి వరకు తనకు ఎన్నో బెదిరింపు కాల్స్‌ వచ్చిన తను ఎవరీ పేరు బయటపెట్టలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. పోలీసులకు తమకు రక్షణ కల్పించాలని కోరారు. మంచి నాయకులను గెలిపించాలని కోరారు. మీరు మంచోడని మీరు గెలిపించిన వారే తనపై దాడి చేశారన్నారు. ఇండిపెండెంట్‌ గా నామినేషన్‌ వేయకూడదని రాజ్యంగంలో ఉందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి పూట ఫోన్లు చేసి భయపెట్టిస్తున్నారన్నారు. తనను బెదిరిస్తున్న వారు ఏ పార్టీ అని చెప్పట్లేదన్నారు. తన తమ్ముడిని కొట్టారన్నారు. తనకు సెక్యూరిటీని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇలా దాడులు చేస్తూ తన లాంటి వారిని తొక్కిపడేస్తున్నారన్నారు. నిరుద్యోగుల కోసం తాను మాట్లాడడమే వారికి ఇబ్బంది కలిగిస్తోందన్నారు. తనకు ఏమైనా అయితే తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు బర్రెలక్క. తెలంగాణ నిరుద్యోగుల తరఫున ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు బర్రెలక్క. కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే, నామినేషన్‌ ను విత్‌ డ్రా చేసుకోవాలంటూ కొందరు వ్యక్తులు బర్రెలక్కను బెదిరించారు. మరికొందరు డబ్బు ఆశ చూపించారు. ఎవరెన్ని చేసిన బర్రెలక్క మాత్రం పోటీలో నుంచి వెనక్కి తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు ఆమెకు మద్దతుగా నిలిస్తున్నారు. బర్రెలక్క తరఫున కొల్లాపూర్‌ నియోజకవర్గానికి చేరుకొని వారు ప్రచారం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు