Saturday, April 27, 2024

చిరంజీవి, తమన్నా సాంగ్‌ షూట్‌..

తప్పక చదవండి

మెహ‌ర్‌ ర‌మేశ్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం భోళా శంకర్ చేస్తున్నాడని తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వేదాళ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్న భోళా శంక‌ర్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. హైదరాబాద్‌, కోల్‌కతా లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంటున్నప్పుడు తీసిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు భోళా శంకర్ టీం ఎక్కడుందో తెలుసా..? షూట్‌లో భాగంగా చిరు టీం స్విట్జర్లాండ్‌కు వెళ్లింది.

స్విట్జర్లాండ్‌లో అందమైన లొకేషన్లలో చిరంజీవి, తమన్నాపై వచ్చే సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు చిరు. స్విట్జర్లాండ్‌లో కండ్లు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో తమన్నాతో సాంగ్‌ షూటింగ్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ, అభిమానులందరినీ బాగా మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం..అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ అంటూ షేర్ చేసిన స్టిల్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి.

- Advertisement -

ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్‌ నటిస్తోంది. భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది!.. ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం !

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు