Wednesday, October 16, 2024
spot_img

రవితేజ ‘ఈగల్’ నుంచి రాకింగ్ నంబర్ ‘ఈగల్స్ ఆన్ హిస్ వే’ విడుదల

తప్పక చదవండి

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో భారీ అంచనాలున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ రిలీజ్ డేట్ సమీపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, రవితేజ పుట్టినరోజు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ రాకింగ్ నంబర్ ‘ఈగల్స్ ఆన్ హిస్ వే’ ను విడుదల చేశారు
దావ్‌జాంద్ స్కోర్ చేసిన పాట రవితేజ పోషించిన సహదేవ్ అకా ఈగల్ పాత్ర యొక్క వైల్డ్ నేచర్ ని తెలియజేస్తుంది. ఈ ఎలక్ట్రిఫైయింగ్ ట్రాక్‌లో ఇంగ్లీష్ లిరిక్స్ రాసిన జార్జినా మాథ్యూ, స్వయంగా వోకల్స్ ని కూడా అందించారు. ఈ థీమ్ నంబర్ ఈగిల్‌కి తగిన ఎలివేషన్‌లను ఇచ్చింది. విజువల్స్ రవితేజ ని కిల్లర్ అవతార్ లో చూపిస్తున్నాయి. ఒరిజినల్ విజువల్స్‌తో సినిమాలో ఈ పాటను చూసినప్పుడు ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది.
ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.
టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిబాబు కరణంతో కలిసి కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే రాశారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
ఈగల్ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు