Saturday, April 27, 2024

‘మ్యాజిక్’ సినిమా మ్యూజికల్ టీనేజ్ డ్రామా

తప్పక చదవండి

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ని చేయడానికి సిద్ధమవుతోంది.
‘జెర్సీ’ వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలువురు కొత్తవారిని ప్రధాన పాత్రలలో పరిచయం చేస్తూ ‘మ్యాజిక్’ అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు.
ఈ కథ, త్వరలో జరగబోయే తమ కాలేజీ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ ను కంపోజ్ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు ఉన్నాయి.
గౌతమ్ తిన్ననూరి యొక్క తాజా చిత్రం కోసం జాతీయ అవార్డులు గెలుచుకున్న సాంకేతిక నిపుణులు సైతం పనిచేశారు. చిత్ర నిర్మాణంలో పాల్గొన్న ప్రతి టెక్నీషియన్‌కు ఈ చిత్ర కథాంశం అత్యంత ఆకర్షణీయమైన అంశంగా మారింది. ప్రముఖ సాంకేతిక నిపుణులు వారి బిజీ షెడ్యూల్‌ల మధ్య కూడా ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు.
ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు అవినాష్ కొల్లా చూసుకున్నారు. ఎడిటర్ గా నవీన్ నూలి, కాస్ట్యూమ్ డిజైనర్ గా నీరజ కోన వ్యవహరించారు.
వీటన్నింటికీ మించి, ఈ మ్యూజికల్ జానర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం ప్రత్యేక ఆకర్షణ. భాషతో సంబంధం లేకుండా తన సంగీతంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న అనిరుధ్, మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
ఎన్నో అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని రూపొందించారు. గడ్డకట్టే పొగమంచు మరియు అకాల వర్షాలు వంటి అనేక ఇబ్బందులను అధిగమించి, నీలగిరి కొండలు అందించే అద్భుతమైన ప్రకృతి అందాలను మరింత అందంగా తెరమీదకు తీసుకొచ్చారు. ఈ విజువల్స్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు, కథలో లీనమయ్యేలా చేస్తాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
ఈ ఆకర్షణీయమైన టీనేజ్ మ్యూజికల్ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు