Friday, October 11, 2024
spot_img

ఘోరాతి ఘోరం..

తప్పక చదవండి
  • రైతులపట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది
    : రైతు రాష్ట్ర నాయకులు వేముల విక్రమ్ రెడ్డి..


రైతుకు దయనీయ దౌర్భాగ్యం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదేమో..? ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకుడి పేరిట వ్యవరిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని, గాదెపల్లి గ్రామ ఉప సర్పంచ్ గురువారం సాయంత్రం దారుణ బెదిరింపులకు దిగాడు.. ఇష్టారీతిన ఏవిధంగా వడ్లు జోకుతారు అన్నందుకు నిన్ను సెంటర్ లో ఎవ్వడు వడ్లు పోయమన్నడు..? నీ వడ్లు నీవు ఇక్కడినుండి తీసుకపో అంటూ.. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నాడు.. గిదా గింతగోరం.. అధికారం అన్నదాతను ఇష్టం వచ్చినట్లు అనుమని చెపుతుందా.. సదరు వ్యక్తిపై తగు చర్యలు చెప్పట్టే వరకు ఊరుకునేది లేదని, ఉన్నత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని బుకాయించడం తప్ప మరొకటి కనపడటం లేదని.. ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించాలని.. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని.. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతామని.. ఎవరికి పడితే వారికి నిర్వహణ అప్పగించడం ఏమిటని.. కొందరి అండ చూసుకొని రైతులను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతోందని.. తద్వారా రైతులు భయానక వాతావరణంలో, దిక్కుతోచని పరిస్థితుల్లో ధాన్యం అమ్ముకుంటున్నారని అభ్యుదయ యువ రైతు, రైతు రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్యే పరాజితుడు వేముల విక్రమ్ రెడ్డి అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు