Friday, April 19, 2024

మందకృష్ణ మౌనమేల.?

తప్పక చదవండి
  • దళితులపై ఈగ వాలిన సహించని మందకృష్ణ మాదిగ..
  • ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలపై స్పందించకపోవడం గల కారణమేంటి.?
  • దళిత న్యాయవాదిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు..
  • మందకృష్ణ స్పందన కొరకు వేచి చూస్తున్న బాధిత న్యాయవాది
  • అఖిలపక్షాల ఆధ్వర్యంలో తిరుమలగిరి బంద్ ప్రశాంతం..

దళితులపై ఈగ వాలిన తక్షణమే స్పందించే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి ‘దళిత బంధు’ అక్రమాలపై గల మెత్తిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదిపై జరిగిన దాడి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎమ్మార్పీఎస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తుంగతుర్తి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం చర్చ కొనసాగుతున్న విషయం విధితమే. దాడిలో గాయపడిన న్యాయవాది యుగంధర్ ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. యుగంధర్ పై జరిగిన దాడికి కారణంగా అతని ఎడమ చెవిలో 3 రంధ్రాలు పడినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకులు అద్దంకి దయాకర్, వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు షర్మిల, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి లాంటి ప్రముఖులంతా బాధిత న్యాయవాదిని పరామర్శించారు.

సంఘటన జరిగి వారం రోజులు అవుతున్నా, మాదిగ జాతికి పెద్దన్న అయిన మందకృష్ణ మాదిగ వైపు నుండి నేటికీ ఎలాంటి ఖండన రాకపోవడంపై దళిత వర్గాల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. బాధిత న్యాయవాది యుగంధర్ ను ఫోన్లో మందకృష్ణ పరామర్శించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ జరిగిన సంఘటనపై స్పందించినప్పటికీ, తమ అధినాయకుడైన మందకృష్ణ మాదిగ వైపు నుండి స్పందనను సదరు బాధిత వర్గం నేతలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో తుంగతుర్తి ప్రాంతంలో పాల్వాయి నగేష్ పై కూడా ఇదే రీతిన తీవ్రమైన దాడి జరిగింది. ప్రస్తుతం న్యాయవాది యుగంధర్ పై జరిగిన దాడిని సదరు మాదిగ సామాజిక వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తుంగతుర్తి మాదిగలకు మందకృష్ణ భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా తిరుమలగిరి మండల కేంద్రంలో స్థానిక అఖిల పక్షాల నేతలు శుక్రవారం నాడు తిరుమలగిరిలో నిర్వహించిన బంద్ సక్సెస్ అయ్యింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు