Sunday, October 13, 2024
spot_img

బల్కం పేట్ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పణ

తప్పక చదవండి

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : అంబర్పేట మహిళామణులు బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్బంగా గుండ్రాతి శారదాగౌడ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ మహిళా సంక్షేమ సంఘం వారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా శారదాగౌడ్ మాట్లాడుతూ.. రేణుకాఎల్లమ్మ తల్లీ మహిమగల అమ్మవారని, అమ్మ దీవెనలు అందరికి ఉండాలని, తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం, సకల సంపదలతో తులతూగాలని ఆశించారు.. కేసీఆర్ కుల, మతాలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండూ సమాంతరంగా పయనిస్తూ పేదలకు సంపద పెరిగేలా పంచుతున్నారని, అదే మోఢీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, కులగణన మంత్రిత్వ శాఖ, బీసీ బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.. యువతకు 18 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడని, బీసీలు మోఢీనీ నమ్మరని కర్ణాటక ఫలితాలు తెలియ చేశాయని అన్నారు.. ఇదే ఫలితాలు రాబోయే ఎలక్షన్స్ లో దేశమంతా ప్రతిబింబిస్తాయని, మోఢీకీ బాయ్ బాయ్ చెప్పే టైమ్ వచ్చింది. బీసీలే గట్టి గుణపాఠం చెబుతారని గుండ్రాతి శారదాగౌడ్ అన్నారు.. ఈ కార్యక్రమంలో మధుగౌడ్, శోభ, మీరా, సునీత, జానకి, స్రవంతి, యాదయ్య, విక్రమ్, అన్నపూర్ణ, రజిత, ఎల్లమ్మ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు