Wednesday, April 24, 2024

దేశం లో అత్యున్నత ఆరోగ్య సంరక్షణ సేవలతో వోల్టర్స్ క్లూవర్..

తప్పక చదవండి

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : ‘వోల్టర్స్ క్లూవర్’ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లు, ఇతర అంతర్జాతీ సేవలతో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో తన నిబద్ధతను చాటుకుంటున్న ప్రముఖ గ్లోబల్ ప్రొవైడర్ సంస్థ. వోల్టర్స్ క్లూవర్ ఆసియా పసిఫిక్ క్లినికల్ ఎఫెక్టివ్‌నెస్ వైస్ ప్రెసిడెంట్ “నార్మన్ డీరీ’ ఇటీవల భారత్ ను సందర్శించిన సందర్భంగా, హెల్త్ కేర్ విభాగంలోని పునరుద్దరణల కోసం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చేపట్టిన వినూత్న ప్రమాణాలు, ప్రణాళికలను కొనియాడారు.

క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ తో ఖచ్చితమైన ఫలితాలు :
తమ సేవల్లో ప్రధానమైన “క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్’ భారతదేశంలోని వైద్యులు క్లినికల్ నిర్ణయాలను తీసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్’ ఇటీవలే ప్రపంచ వేదికపై 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రోగుల ఫలితాలను మెరుగుపరచడం కోసం ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఈ విధానంలోని రియల్ టైం యాక్సెస్ కీలకంగా పని చేస్తుంది. అంతే కాకుండా క్లినికల్ డెసిషన్ సపోర్ట్ కోసం కొత్త ప్రమాణాన్ని రూపొందించింది. ఆసుపత్రుల స్థాయిలోనే క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‌ను అమలు చేయడం వలన స్థిరమైన, అనువైన ఆరోగ్య సంరక్షణను అందించవచ్చు. దీనితో పాటుగా వైద్యులందరికి ఒకే విధమైన కచ్చితమైన సమాచారం అందించే అవకాశముంటే, వాటిని వైద్యులు ధృవీకరించగలిగినప్పుడు ఆ నిర్ణయాలు ఆరోగ్య సంరక్షణలో ప్రామాణికంగా మారుతాయి.

- Advertisement -

భారత్ లో హెల్త్ కేర్ భేష్ :
భారత్ వేదికగా ఆరోగ్య సంరక్షణ కోసం హెల్త్‌కేర్ మార్కెట్‌, పెట్టుబడులు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ‘ వోల్టర్స్ క్లూవర్’ ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సంధర్భంగా రోగులకు అద్భుత ఫలితాలను అందించడం కోసం తమ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ప్రామాణికం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా క్లినికల్ డెసిషన్ సపోర్ట్ నుంచి డ్రగ్ రెఫరెన్షియల్ సొల్యూషన్స్ వరకు వినూత్న హెల్త్‌కేర్ ఇన్నోవేషన్లతో కంపెనీ విశేష కృషి చేస్తుంది. హెల్త్ కేర్ విభాగంలోని వివిధ పరిశ్రమలలోని నిపుణులకు లేటెస్ట్ నాలెడ్జ్, సమాచారాన్ని అందించే నైపుణ్యంలో వోల్టర్స్ క్లూవర్ కు దీర్ఘకాల చరిత్ర ఉంది. అంతే కాకుండా ఆరోగ్య సంరక్షణలో నూతన భవిష్యత్ ఆవిష్కరణలకు సన్నద్ధమైంది. సంస్థ తన పరిధిని, ప్రభావాన్ని భారీ స్ధాయిలో విస్తరిస్తుంది. ఈ తరుణంలో ‘ వోల్టర్స్ క్లూవర్’ ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ప్రామాణీకరించడమే లక్ష్యంతో, నిబద్దతతో ముందుకు సాగుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు