Thursday, April 25, 2024

మట్టి మాఫియాకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన కరీంనగర్..

తప్పక చదవండి
  • జిల్లా మంత్రి కనుసన్నల్లోనే ఎల్.ఎం.డి లోపల అక్రమ మట్టి తవ్వకాలు..
  • వాల్టా యాక్ట్ కు తూట్లు పొడుస్తున్న మైనింగ్, రెవిన్యూ అధికారులు..
  • గ్రానైట్, ఇసుక మాఫియాలే కాకుండా మట్టి మాఫియాకు తెర లేపిన అధికార యంత్రాంగం..
  • చెక్ పోస్టుల రద్దుతో అక్రమ రవాణాకు హద్దు, అదుపు లేకుండా పోయింది..
  • బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఘాటు విమర్శలు.

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్రానికి సెంటిమెంట్ జిల్లాగా పేరు పొందిన కరీంనగర్ నేడు గ్రానైట్, ఇసుక మాఫియాలే కాకుండా నేడు కొత్తగా మట్టి మాఫియాకు కూడా కేర్ అఫ్ అడ్రస్ గా మారిందని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శలు చేశారు. కరీంనగర్ కు తలాపున ఉన్న లోయర్ మానేరు డ్యామ్ లోని నీళ్లు తగ్గడంతో కొందరు అక్రమార్కులు ప్రోక్రైన్ లతో, టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుంటే అధికార యంత్రాంగం ఎందుకు చూసి, చూడనట్లు వ్యవహరిస్తున్నారని, వీరి నిర్లక్ష్యం అనేక అనుమానాలకు తావునిస్తున్నాదని ఆరోపించారు. ఈ తవ్వకాలు పద్మనగర్ జీరో పాయింట్ వద్ద మార్కెండేయ నగర్ వద్ద గల మానేరు డ్యామ్ లోపల హిందు స్మశాన వాటిక వెనకాల పెద్ద ఎత్తున ప్రోక్లైన్ లతో తవ్వకాలు చేస్తూ టిప్పర్లతో తరలిస్తుంటే మైనింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పని చేస్తున్న రెవిన్యూ అధికారులు, ఎస్.ఆర్.ఎస్.పి అధికారులు చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ మట్టి అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన జిల్లా మంత్రి మౌనంగా ఉండడం వెనుక అనేక అనుమానాలు రేకేస్తున్నాయని, మట్టి అక్రమ రవాణా చేసే వ్యక్తులకు జిల్లా మంత్రి అండదండలతో పాటు అయన కనుసన్నల్లోనే ఈ మట్టి అక్రమ రవాణా మాఫియా నడుస్తుంది అనడానికి మైనింగ్, రెవిన్యూ, ఎస్.ఆర్.ఎస్.పి అధికారులు మౌనం, వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే దీనికి నిదర్శనమని ఆయన ఘాటుగా విమర్శించారు. లోయర్ మానేర్ డ్యామ్ లోపల నుండి మట్టిని తవ్వడం వాల్టా యాక్ట్ చట్టానికి వ్యతిరేకమని, అలాగే అక్రమ తవ్వకాలతో వాల్టా యాక్ట్ కు తూట్లు పొడిచి నియమ, నిబంధనలను ఉల్లాంగించడమే కాకుండా ఈ మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయుటకు చెక్ పోస్టులు పెట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చెక్ పోస్టులు పెట్టకుండా ఈ అక్రమ రవాణాను ప్రోత్సాహిస్తూ ఎల్.ఎం.డి మనుగడకు, పర్యావరణానికి దెబ్బతీసే విధంగా వ్యవహారిస్తున్న అక్రమార్కులు, వారికి వంతపాడుతున్న మైనింగ్, రెవిన్యూ, ఎస్.ఆర్.ఎస్.పి అధికారులతో పాటు జిల్లా మంత్రి వ్యవహారిస్తున్నారని దుయ్యాబట్టారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి, సంబంధిత అధికారులు ఎల్.ఎం.డి లోపల నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను వెంటనే అరికట్టి, ఇప్పటివరకు ఎల్.ఎం.డి నుండి మట్టిని అక్రమంగా తరలించిన వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకొని పక్షంలో బీజేపీ పార్టీ న్యాయపరమైన పోరాటం చేస్తుందని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు