Saturday, July 27, 2024

108 రాకపాయె..నిండు ప్రాణం బలై పాయె..

తప్పక చదవండి
  • సమయానికి చేరుకోని ఆంబులెన్స్‌..
  • అంబులెన్సులు అందుబాటులో లేవనిచెప్పిన అధికారులు..
  • కనీస వైద్య సదుపాయం కల్పించని
  • ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు..
  • వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం మద్వాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్నారం మణెమ్మ, అనారోగ్యానికి గురై, ప్రాణాపాయ స్థితిలో ఉండగా,108 వాహనం, అంబులెన్సు కు ఫోన్‌ చేస్తే, అంబులెన్సు లు అందుబాటులో లేవని ఒక గంట సమయం పడుతుందని సమాధానం ఇచ్చారు అంబులెన్సు సిబ్బంది.. వెంటనే కుటుంబ సభ్యులు వాళ్ళ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆటోలో తాండూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళుతుండగా, మార్గ మధ్యలో పెద్దేముల్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు దగ్గరలో, అప్పుడే వచ్చిన అంబులెన్సులో పేసెంట్‌ ను తాండూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లడం జరిగింది. తాండూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏమర్జెన్సీ వార్డు లో అడ్మిట్‌ చేశారు. అక్కడ వున్న డ్యూటీ డాక్టర్‌, పరిస్థితి విషమంగా వుంది, హైదరాబాద్‌ లోని గాంది ఆసుపత్రి, లేదా ఉస్మానియా ఆసుపత్రి కి తీసుకెళ్లండి అని సమాధానం చెప్పడం జరిగింది. కనీసం పేసెంట్‌ కు ఏమైంది అని, టెస్ట్‌ చెయ్యకుండా, తెలుసుకోకుండా, హైదరాబాద్‌ వెళ్ళమని చెప్పడం దారుణం. మా దగ్గర ఏమి చికిత్స లేదు మీరు హైదరాబాద్‌ తీసుకెళ్లాలని డ్యూటీ డాక్టర్‌ చెప్పారు. చెప్పిన 10 నిమిషాలలో, ఎన్నారం మణెమ్మ చనిపోవడం జరిగింది. ఏంటి సార్‌ ఈ పరిస్థితి అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, మా దగ్గర పెద్ద మిషన్‌ లు లేవు, మీ ఇష్టం ఉంటే ఉంచండి లేకపోతే లేదు అన్నటుగా సమాధానం ఇచ్చారు.. ఇదే విషయమై తాండూర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు ఫోన్‌ చేస్తే ఆయన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మా లాంటి పేదవాళ్ళు, సర్కారు దావఖణాల్లో న్యాయం జరుగుతదని వస్తే మా అమ్మ ప్రాణం పోయిందని ఎన్నారం ఆశప్ప కుటుంబ సభ్యులు బోరున విలపించారు . సరైన సమయంలో అంబులెన్సు రాక, మెరుగైన వైద్యం అందకనే మా అమ్మ మానెమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్‌, ఆయన మూతి నాకే రాజకీయ దొంగలు స్పందించి, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇంకా ఇలాంటి పేద ప్రజల ప్రాణాలు పోకుండా, సకల సౌకర్యాలు వున్నా కూడా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న, ఏమర్జెన్సీ డ్యూటీ డాక్టర్స్‌ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అదే విదంగా, తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి చాలా దారుణంగా వుందని, నిజమైన పేదవాళ్లకు వైద్యం సరిగ్గా అందుతలేదని మణెమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాదికారులు స్పదించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇంకా ఇలాంటి పేద ప్రజల ప్రాణాలు పోకుండా, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, తగు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు