Sunday, September 15, 2024
spot_img

బడిలో వంట వండేదే లేదు

తప్పక చదవండి
  • కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ఇబ్రహీంపట్నం : మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ బడుల్లో ఈ నెల 28 నుండి వంట వండేది లేదని తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెబాట పట్టనున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్సీలో సిఐటియు నాయకులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటియు మండల కన్వీనర్‌ చందు నాయక్‌ మాట్లాడుతూ.. కార్మికులకు పెంచిన వేతనం రూ. 3 వేలు ఇవ్వాలని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గత జులై నుండి రూ. 3 వేల గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పినప్పటికీ అందుకు అనుగుణంగా బడ్జెట్‌ విడుదల చేయలేదని అన్నారు. బడుల్లో కొత్త మెనూలో అధికారులు రాగిజావ వండి పెట్టాలని ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదన్నారు. సమ్మె నిర్వహించే లోగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు