Tuesday, May 14, 2024

యోగా పేటెంట్‌ అవసరం లేదు..

తప్పక చదవండి
  • దేశవ్యాప్తంగా ఘనంగా యోగాడే
  • రాష్ట్రపతి భవన్‌లో యోగాలో ద్రౌపది ముర్ము
  • గుజరాత్‌లో లక్షమందితో యోగా దినోత్సవం
  • ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్‌
  • ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ
  • యోగా భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని వెల్లడి

న్యూఢల్లీదేశవ్యాప్తంగా యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో యోగాలో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఐరాస నాయకత్వంతో కలిసి యోగా చేయనున్నారు. భారతీయులు కొత్త ఆలోచనలను స్వాగతించారని, వాటిని సంరక్షిస్తూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో కలిసి యోగా చేశారు. గుజరాత్‌లో 9వ ప్రపంచ యోగా దినోత్సవం ప్రత్యేకతను చాటుకుంది. సూరత్‌లో నిర్వహించిన యోగాడే ఉత్సవాల్లో దాదాపు లక్ష మంది పాల్గొన్నారు. సూరత్‌లో జరిగిన యోగా డే ఈవెంట్‌ ఒకే చోట యోగా సెషన్‌ కోసం అత్యధిక మంది ప్రజలు గుమిగూడి కొత్త గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను నెలకొల్పింది. రాష్ట్రవ్యాప్తంగా 72వేల వేదికల్లో సుమారు 1.25 కోట్ల మంది యోగాడేలో పాల్గొన్నారని గుజరాత్‌ హోంమంత్రి హర్ష సంఘవి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ యోగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చారని పటేల్‌ అన్నారు. సూరత్‌లోని దుబాస్‌ ప్రాంతంలో నిర్వహించిన యోగాడే ఈవెంట్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ పాల్గొన్నారు. ªఔరత్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రస్థాయి కార్యక్రమంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహించింది. సీఎం పటేల్‌ సమక్షంలో ఈవెంట్‌ జరగ్గా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు వివిధ జిల్లాల్లో కార్యక్రమాలలో పాల్గొన్నారు. దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ (అహ్మదాబాద్‌), స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (కెవాడియా), వైట్‌ రాన్‌ ఆఫ్‌ కచ్‌, మోధేరా సన్‌ టెంపుల్‌ వంటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 ఐకానిక్‌ ప్రదేశాల్లో యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కాలేజీలు, ఆరోగ్య కేంద్రాలు, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌, జైళ్లు, పోలీస్‌ స్టేషన్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో యోగా డే ఈవెంట్‌ను నిర్వహించారు.
9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం న్యూయార్క్‌లో అద్వితీయమైన యోగా సెషన్‌కు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం వహించారు. ఈ యోగా కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి అగ్రశ్రేణి అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబారులు, ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది’’ అని ప్రధాని మోడీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు. వసుధైవ కుటుంబం అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ మరియు ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ తన మొదటి అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో ఉన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్‌ 21వతేదీన జరుపుకుంటారు. యోగా సాధన వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు ఇది ప్రపంచ వేదికగా ఉపయోగపడుతుందని మోడీ వివరించారు. సెప్టెంబరు 2014వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో తన ప్రసంగం సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించాలనే ఆలోచనను మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మోడీ నేతృత్వంలో నిర్వహించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు