Saturday, April 27, 2024

మాయమైన ప్రభుత్వ భూమి..!

తప్పక చదవండి
  • హరితహారం మొక్కలు, ఫెన్సింగ్‌ తొలగించి మరీ కబ్జా..
  • ఐదు ఎకరాల్లో వెలసిన వందలాది గుడిసెలు..
  • కన్నెత్తి చూడని అధికారులు..
  • వేలాది యూనిట్ల విద్యుత్‌ చోరీ..
  • నిద్రమత్తులో విద్యుత్‌శాఖ
  • కీలుబొమ్మలుగా మారిన పేద ప్రజలు..
  • కలెక్టర్‌ గారూ.. జర ఇటువేపు చూడండి..
    కొత్తగూడెం : అసలే పేద ప్రజలు, అందులో గిరిజనులు, అమా యకులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు. అభం శుభం తెలియని అమాయకులను ముందుంచి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేసేందుకు కుట్ర చేస్తున్నారు. అధికార పార్టీ బడా నాయకుడు ఈకుట్రలో భాగస్వామి అని వినికిడి. ప్రభుత్వ భూమని తెలుసు.. ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తే అధికారులు, ప్రభుత్వం ఊరుకోదని తెలుసు.. అయినా ఇండ్లు కట్టుకోండి ఆభూమి మీకే దక్కుతుందని, ఏం జరిగినా మేము చూసుకుంటామని మాయ మాటలు చెప్పి గిరిజనులను పురిగొల్పుతున్నారు.. ఈతతంగాన్ని చేష్టలుడికి చూస్తున్నారు ప్రభుత్వ అధికా రులు.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా నోరు మెదపడ లేదు.. కారణం ఏంటం టే కబ్జాదారుల వెనుకుంది అధికారపార్టీ పెద్దలు కాబట్టి.. హరితహారం మొక్కలను, వేసిన ఫెన్సింగ్‌ను పీకేసి మరీ కబ్జాకు పాల్పడ్డప్పటికీ అధికారగణం నోరు మెదపకుండా చూడడం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది.. ప్రభుత్వ భూమిని కబ్జా, ఆస్తులను ధ్వంసం చేస్తే కేసులు అవుతాయని ఇబ్బం దులు గురికావాల్సి వస్తుందన్న విషయాన్ని చెప్పకుండా కొంతమంది స్వలాభం కోసం ప్రోత్సహి స్తున్నారు. పెద్దఎత్తున విద్యుత్‌ చోరీకి సైతం పురిగొల్పారు. కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజక వర్గంలోని, చుంచుపల్లి మండల పరిధిలో ఉన్న ప్రశాంతి నగర్‌ పంచాయతీ కార్యాలయానికి ఆనుకొని సర్వే నెంబర్‌ 1/1లో సుమారు 5ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆభూమిని కబ్జా చేసేందుకు అధి కార పార్టీకి చెందిన ఓ బడా ప్రతినిధితో పాటు, మరికొంత మంది ప్రజా ప్రతినిధులు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో అనేకమార్లు అధికా రులు ఆకుట్రలను భగ్నం చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం అటుకేసి కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద మతలబే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గరిమెళ్లపాడుకు చెందిన ప్రజలను పురిగొల్పి మాయమాటలు చెప్పి రెచ్చగొట్టి ఇక్కడ గెడిసెలు వేయించాలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో హరితహారం మొక్కలను నాటడంతోపాటు పెంచింగ్‌ సైతం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పనుల కోసం సుమారు రెండు లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈభూమి కబ్జా గురికావడంతో అక్కడ వేసిన హరితహారం మొక్కలు, ఫెన్సింగ్‌ కనిపించకుండా పోయింది. దీంతో పంచాయతీ సొమ్ము వృధా అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు ఇటికేసి కన్నెత్తి చూడలేదు. అంటే కబ్జాదారుల వెనుక ఉన్న అధికారపార్టీ నాయకులు ఏమేరకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక నెల విద్యుత్‌ బిల్లు కట్టకపోతేనే విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించే అధికారులు ఈవేలాది యూనిట్ల చోరీ కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన, చేసేందుకు ప్రోత్సహించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పిలువురు డిమాండ్‌ చేశారు. అదే విధంగా విద్యుత్‌శాఖాధికారులు సైతం స్పందించి వేలాది యూనిట్లు విద్యుత్‌ చోరీకి గురికాకుండా చూడాలని కోరుతున్నారు. ఈ ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా విషయంపై జిల్లాకలెక్టర్‌ ప్రియాంక దృష్టి సారించాలని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని పంచాయతీ ప్రజలతో పాటు, పలు పార్టీల నాయకులు కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు