Saturday, July 27, 2024

ఫిర్యాదు చేసినా.. కథనాలు రాసినా బెదిరింపులు..

తప్పక చదవండి
  • కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా పట్టింపులేదు..
  • యాధావిధిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు..
  • ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్న మండల అధికారులు..
  • మిర్యాలగూడ జిల్లా, దామరచర్ల మండల
    కేంద్రంలో రెచ్చిపోతున్న కబ్జాకోరులు..

    మిర్యాలగూడ : తహసిల్దార్‌ కార్యాలయం సాక్షిగా ప్రభుత్వ భూము లను చెర పట్టిన కబ్జాదారులు. రాత్రికి రాత్రే ఎదేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నకిలీ, ఫోర్జరీ కాగితాలతో కోర్టులను సైతం బురిడీ కొట్టించి. కింది స్థాయి అధికారులను మచ్చగా చేసుకొని, అడిగి నంత ముట్టజెప్పి కబ్జాదారులు విచ్చలవిడిగా తమ ఆక్రమణలు కొనసాగించారు. వీటిపై కొందరు మండల స్థాయి మొదలుపెట్టుకొని జిల్లా కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికార పార్టీ నాయ కుల అండదండలతో అప్రతిహతంగా కబ్జాదారులు ఆక్రమణలు కొనసాగిస్తూనే ఉన్నారు. పత్రికల్లో కథనాలు, ఫిర్యాదుదారుల ఒత్తిడి మేరకు రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్‌ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికే కబ్జాదారులతో కుమ్మక్కైన కిందిస్థాయి సిబ్బంది ఆయన ఆదేశాలను తుంగలో తొక్కి నిర్మాణాలను తొలగించకపోగా కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ కుంటి సాకులతో నివేదికలు అందించి కలెక్టర్‌ నే బురిడీ కొట్టించారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. దామరచర్ల మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సర్వేనెంబర్‌ – 825 లో ఉన్న ప్రభుత్వ భూమి బహిరంగ మార్కెట్లో కోట్ల విలువ చేస్తుంది. ఈ భూములపై కన్నేసిన నాయకులు కొందరు అధికార పార్టీ అండదండలతో ఫోర్జరీ సంతకాలతో, నకిలీ పాస్‌ పుస్తకాలతో ఏదేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారని సమాచారం. ఈ విష యంపై గతంలో రెవెన్యూ అధికారులు కోర్టును ఆశ్రయించి ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించిన ప్పటికీ ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో దశాబ్ద కాలం తర్వాత తిరిగి కబ్జాదారులు కింది స్థాయి అధికారులను ముడుపులతో మచ్చిక చేసుకుని భూములను కబ్జా చేశారు. తాసిల్దారును కూడా రానీయ కుండా ఆ పదవిలో తమకు అనుకూలమైన అధికారికి ఇన్చార్జిగా బాధ్యతలు ఇప్పించుకొని విచ్చల విడిగా అక్రమ పర్వాన్ని కొనసాగించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని కుల సంఘాల నాయకులు వివిధ స్థాయిలో అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు, లోకా యుక్తను ఆశ్రయించారు. ఈ అక్రమ తంతును పత్రికలు పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిం చడంతో ఇటీవల నూత నంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి అక్రమ నిర్మాణా లను తొలగిం చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కింది స్థాయి అధికారులు ఇప్పటికే కబ్జా దారులతో మిలాఖత్‌ అయి ఉండటంతో చర్యలు ఏమి చేపట్టకపోగా జిల్లా కలెక్టర్‌ ని బురిడీ కొట్టిం చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కబ్జాదారులు ఫిర్యాదు చేసిన వారిని, కథ నాలు రాసిన పాత్రికేయులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి అక్రమార్కుల ఆగడాల అరికట్టాలని, ఈ అక్రమ తంతుపై పూర్తి విచారణ జరిపి కబ్జాల చెర నుండి ప్రభుత్వ భూములనుకాపాడాలని, దురాక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు