Saturday, March 2, 2024

అవినీతిని అరికట్టాం.. విశ్వసనీయతను పెంచాం

తప్పక చదవండి
  • అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న భారతీయ మహిళలు
  • మహిళలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోన్న బీజేపీ ప్రభుత్వం
  • రోజ్‌గార్‌ మేళా ద్వారా అభ్యర్థులకు నియామక పత్రాలు
  • వర్చువల్‌గా నియామక పత్రాలను అందజేసిన ప్రధాని

న్యూఢిల్లీ : భారతీయ మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలోని మహిళలకు తమ ప్రభుత్వం.. సరికొత్త ద్వారాలు తెరుస్తోందని చెప్పారు. దేశ మహిళలకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ద్వారాలు తెరుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. దేశానికి సరికొత్త భవిష్యత్‌ను అందిస్తుందని చెప్పారు. దేశంలోని 50 శాతం జనాభాకు ఈ బిల్లు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు రోజ్‌గార్‌ మేళా ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన 51 వేల మందికి.. ప్రధాని మోడీ వర్చువల్‌గా నియామక పత్రాలను అందజేశారు. భుత్వ పాలనలో సాంకేతికత వినియోగం పెరిగిందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో సాంకేతికతను ఉపయోగించడం వల్ల అవినీతిని అరికట్టామని.. విశ్వసనీయతను పెంచామని తెలిపారు. నిశిత పరిశీలన, వేగంగా కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి.. 100 శాతం ప్రజలు సంతృప్తి చెందాలనే నూతన ధృక్పథంతో తాము పనిచేస్తున్నట్లు మోడీ వివరించారు. ‘‘రోజ్‌గార్‌ మేళాలో మన యువతులు కూడా ఎక్కువ సంఖ్యలో నియామక పత్రాలు అందుకున్నారు. నేడు భారతీయ మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. మన నారీమణుల విజయం అన్ని చోట్ల గౌరవాన్ని అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. నారీమణుల కోసం కొత్త ద్వారాలు మేము తెరుస్తున్నాం. మన మహిళలు సాయుధ బలగాల్లో కూడా చేరి భారత దేశానికి సేవ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో సాంకేతికతను ఉపయోగించడం వల్ల అవినీతిని అరికట్టాం. విశ్వసనీయతను పెంచామని అన్నారు. మరోవైపు, అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో రోజ్‌గార్‌ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1000 మందికి నియమాక పత్రాలను అందజేశారు ప్రధాని మోడీ. అపాయింట్‌మెంట్‌ లెటర్‌లను అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఉపాధి మేళా ద్వారా యువత.. గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలను పొందాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు