Wednesday, September 11, 2024
spot_img

మీ వెంటే మేమంతా..

తప్పక చదవండి
  • నీలం మధుకు బాసటగా నిలుస్తున్న నాయకులు..
  • ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యండి…
  • డేఫినెట్ గా గెలిపించుకుంటాం..
  • షేవ్ చేసేవాడు కాదు.. సేవ చేసే మీరే కావాలి..
  • పఠాన్ చెరు నియోజకవర్గంలో మీ సత్తా ఏంటో చూపెడతాం..
  • తేల్చి చెప్పిన తెలంగాణ మత్స్యశాఖ అధ్యక్షులు
    లోకానబోయిన రమణ ముదిరాజ్..

హైదరాబాద్: ఆయన ఎప్పుడూ పదవి కావాలని కోరుకోలేదు.. పదవి ఉంటేనే సేవచేయగలం అనే కొటేషన్ ఆయనకు అస్సలు సరిపడదు.. కానీ ప్రజలు కోరుకుంటే ఎలాంటి వారినైనా అడక్కుండానే పదవి వరిస్తుంది.. ప్రజాసేవకుడిగా వుంటున్నవారు ప్రజల అభీష్టాన్ని కాదని వెళ్ళలేరు.. ఇప్పుడు అదే పరిస్థితి పఠాన్ చెరు నియోజకవర్గం బీ.ఆర్.ఎస్. నాయకులు నీలం మధు ముదిరాజ్.. ఎప్పుడూ ప్రజాసేవలో గడిపే ఆయనను తమ ఎమ్మెల్యేగా చూసుకోవాలని ఆశపడుతున్నారు నియోజకవర్గ ప్రజలు.. బీ.ఆర్.ఎస్. అధినేత నీలం మధుకు టికెట్ ఇస్తారని ఆశించారు.. కానీ ఆయనకు టికెట్ రాలేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఎంతో నిరాశకు గురైయ్యారు.. అయితే చివరి క్షణంలో మార్పులు చేర్పులుంటాయని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వారిలో మళ్ళీ ఆశలు చిగురించాయి..

నీలం మధు పఠాన్ చెరు నియోజక వర్గంలో సుపరిచితమైన పేరు.. సేవ అనే పదం చూస్తే ఆయనే గుర్తుకువస్తారు.. సహాయం అనే పదం ఆయనను చూసి గర్వంగా తనను తాను లిఖించుకుంటుంది.. తర తమ బేధాలు లేకుండా.. పేద గొప్ప తేడాలు లేకుండా అడిగిన వారికి సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.. ఊహ తెలియని చిన్న పిల్లలు సైతం నీలం మధు అనగానే చిరునవ్వు నవ్వుతారు.. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో హల్ చేయడం మూడా మనం చూసాం.. ఇలాంటి నాయకులను ప్రజలెప్పుడూ కోరుకుంటారు.. అందుకే ఆయనకు బ్రహ్మరధం పడుతున్నారు.. వారూ వీరూ అని కాకుంటా అన్ని వర్గాల వారు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.. రోజు రోజుకూ ప్రజాధారణ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.. బీ.ఆర్.ఎస్. టికెట్ ఆయనకే కేటాయించాలనే డిమాండ్స్ మిన్నంటుతున్నాయి.. బీ.ఆర్.ఎస్. అధినేత పునరాలోచించి నీలం మధు ముదిరాజ్ కే పఠాన్ చెరు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరుతున్నారు.. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. నీలం మధు లాంటి ప్రజానాయకుడికి టికెట్ కేటాయిస్తే, గెలుపు తధ్యమని, పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు..

- Advertisement -

కాగా తాజాగా నీలం మధు ముదిరాజ్ మీరు పఠాన్ చెరు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీ చేయండి మేము మీవేంటే అని తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ అధ్యక్షులు లోకానబోయిన రమణ ముదిరాజ్.. ఆయనతో తమ గొంతు కలిపారు రాష్ట్ర మత్స్యశాఖ మహిళా అధ్యక్షురాలు పుష్పలతం, రాష్ట్ర మత్స్యశాఖ మహిళా ఉపాధ్యక్షులు సుభాషిని, నల్గొండ జిల్లా ముదిరాజ్ కార్యదర్శి గొడుగు బాలప్ప, కట్ట హరి, నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం తాటికల్లు గ్రామం ముద్ర సంఘం సభ్యులు బంటు రవి, రికార్డింగ్ యాదగిరి, రామకృష్ణ, వెంకన్న, రామలింగయ్య, కాటమరాజు, యాదగిరి తదితరులు.. ఈ మేరకు వారు తమ మద్దతు తెలుపుతూ దండుగా కదిలి యాత్ర చేపట్టారు.. తదనంతరం నీలం మధుకే తమ సపోర్ట్ అంటూ తీర్మానం చేయడం విశేషం.. మరి చూడాలి బీ.ఆర్.ఎస్. అధినేత ఎలా స్పందిస్తారు అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు