Wednesday, May 15, 2024

యూపీఐ లైట్ లావాదేవీల పరిమితి పెంపు..

తప్పక చదవండి
  • శుభవార్త తెలిపిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా..
  • రూ. 200 నుంచి రూ. 500లకు పెంపు..
  • పిన్ నమోదు చేయకుండానే ఆఫ్ లైన్ మోడ్ లో సేవలు..
    న్యూ ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింతగా పెంచేందుకు గాను.. ఆఫ్‌లైన్ మోడ్‌లో యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.200 నుంచి రూ.500లకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం యూపీఐ లైట్‌, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ పై సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 200 గానూ, ఓవరాల్‌ లిమిట్ రూ.2000 గానూ నిర్దేశించింది. ఇప్పుడు ఆర్బీఐ కొత్త ప్రతిపాదన ప్రకారం సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.500కి పెంచబడుతుంది. పిన్ నమోదు చేయకుండానే ఆఫ్‌లైన్ మోడ్‌లో ఈ సేవల్ని పొందవచ్చు.
    యూపీఐ లైట్ చెల్లింపుల పరిమితిని పెంచాలన్న డిమాండ్ నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అయితే.. సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ని రూ.500 కి పెంచినా, యూపీఐ లైట్ వ్యాలెట్‌లో లోడ్ చేసుకునేందుకు ఉన్న మొత్తాన్ని మాత్రం రూ.2000కే పరిమితం చేయడం జరిగిందన్నారు.
    టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ విషయంలో రిస్కులు పొంచి ఉన్న నేపథ్యంలో.. వ్యాలెట్ పరిమితిని పెంచలేదని ఆయన అన్నారు. ఈ చెల్లింపుల పరిమితికి సంబంధించిన సూచనల్ని త్వరలోనే జారీ చేస్తామన్నారు. అలాగే.. డిజిటల్ పేమెంట్స్‌కు టెక్నాలజీని జోడించే ఉద్దేశంతో కొత్తగా ‘కన్వర్వేటివ్ పేమెంట్స్’ని తీసుకొస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇందుకోసం యూపీఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని జోడించామన్నారు. దీని ద్వారా.. సంభాషణలతోనే లావాదేవీలు పూర్తి చేయొచ్చని.. అయితే తొలుత ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. క్రమంగా ఇతర భాషల్ని జోడిస్తామన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు