Tuesday, May 21, 2024

కేంద్రానికి ప్రతిపక్ష ఇండియా ఎంపీల వార్నింగ్..

తప్పక చదవండి
  • మణిపూర్ సమస్యకు తెరదించాలి..
  • దేశ భద్రతకే ముప్పు ఏర్పడనుంది..
  • అక్కడి విషయాలను గవర్నర్ కి తెలిపిన కూటమి..
  • అన్ని తెగల నాయకులతో సమావేశాలు నిర్వహించాలి..

మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను గవర్నర్ అనుసూయియా యూకీకి తెలిపారు. ఈ ఎంపీలు గవర్నర్‌ను కలుసుకున్న తర్వాత రాజ్ భవన్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. శని, ఆదివారాల్లో తాము రాష్ట్రంలో పర్యటించామని, తాము అనేక అంశాల గురించి తెలుసుకున్నామని చెప్పారు. ఈ వివరాలను తాము గవర్నర్ వద్ద ప్రస్తావించామని తెలిపారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలు సంయుక్తంగా గవర్నర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. గవర్నర్ స్పందిస్తూ, రాష్ట్రంలోని పరిస్థితులపై తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. తాము చెప్పిన మాటలతో గవర్నర్ ఏకీభవించారని తెలిపారు. అన్ని తెగలవారితోనూ సమావేశాలను ఏర్పాటు చేసి, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని ఆమె చెప్పారన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపించాలని సలహా ఇచ్చారని చెప్పారు. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పారదోలడానికి, సమస్యను పరిష్కరించడానికి అన్ని తెగల ప్రతినిధులతోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారన్నారు. ఈ సలహాకు తాము కూడా అంగీకారం తెలిపామని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు