Saturday, May 4, 2024

ప్రధాని మోడీకి తిలక్ జాతీయ అవార్డు..

తప్పక చదవండి
  • ఆగష్టు 1 న పూణేలో అవార్డు ప్రధానం..
  • దగదుపేత్ వినాయక ఆలయాన్ని సందర్శించనున్న మోడీ..
  • ప్రధాని పర్యటనలో భాగంగా మెట్రో రైళ్ల ప్రారంభం..
  • వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించనున్న ప్రధాని..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన పుణే లో పర్యటించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. తొలుత దగదుషేత్ వినాయక ఆలయాన్ని దర్శించుకుని, పూజల్లో పాల్గొంటారు. అనంతరం జరిగే ఒక కార్యక్రమంలో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రధాని అందుకుంటారు. మోదీ పర్యటనలో భాగంగా మెట్రో రైళ్లను ప్రారంభిస్తారని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పీఎంఓ తెలిపింది. ఇందులో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 1,280 పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ వర్దంతి సందర్భంగా ఏటా ఆగస్టు 1న జరిగే కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును తిలక్ స్మారక్ మందిర్ టస్టు ప్రదానం చేస్తుంటుంది. దేశ ప్రగతి, అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ఈ అవార్డుకు ఈసారి ప్రధాన మంత్రిని ట్రస్టు ఎంపిక చేసింది. ఈ అవార్డు అందుకుంటున్న ప్రముఖులలో మోదీ 41వ వ్యక్తి. ఇంతవరకూ అవార్డును అందుకున్న వారిలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇందిరా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, ఎన్.ఆర్.నారాయణ మూర్తి, డాక్టర్.ఇ.శ్రీధరన్ తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు