Sunday, June 23, 2024

మంచమెక్కిన భాగ్యనగరం..

తప్పక చదవండి
  • సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు..
  • ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు..
  • ఒక్కో ఆసుపత్రికి 500 వరకు ఓపీ సంఖ్య పెరిగింది..
  • డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో ఆందోళన..

గడచిన వారం రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వర్షాలు, వరదలతో భాగ్యనగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.. హైదరాబాద్ నగరంలో వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. జీ.హెచ్.ఎం.సి. పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరంలో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువైంది. ఒక్కో ఆసుపత్రికి 500 వరకు పెరిగిన ఓపీ సంఖ్య పెరిగింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీలో డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు