Saturday, May 4, 2024

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఉగాండా

తప్పక చదవండి

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ కోసం క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్‌ దేశంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. అల్పేష్‌ రంజానీ, దినేష్‌ నక్రానీ, హెన్రీ సెనియోండో, బ్రియాన్‌ మసాబా తలో రెండు వికెట్లు తీశారు. జింబాబ్వేపై ఉగాండా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నమీబియా, ఉగాండా జట్ల చేతులో ఓడిపోయిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వే 2019 ప్రపంచకప్‌, 2023 ప్రపంచకప్‌కు లకు కూడా అర్హత సాధించలేకపోయింది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూ గినియా, కెనడా, నేపాల్‌, ఒమన్‌, నమీబియా, ఉగాండా జట్లు ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీ ప్రారంభంలో, ఐదు జట్లతో కూడిన నాలుగు గ్రూపులు మొదటి రౌండ్‌లో తలపడతాయి. ఒక్కో గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ 8కి చేరుకుంటాయి. అక్కడ నుంచి మళ్లీ సూపర్‌ 8 ముగింపులో మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక 2024 టీ20 ప్రపంచకప్‌ కోసం ఆఫ్రికా జోన్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు 7 జట్ల మధ్య జరుగుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు