Friday, October 11, 2024
spot_img

రెండు వేల నోట్లు ఇక మిగిలింది పదివేలే!

తప్పక చదవండి

ముంబై : చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ రూ.2,000 డినామినేషన్‌ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ‘మే 19వ తేదీ బిజినెస్‌ ముగింపు సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 బ్యాంక్‌ నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్‌ 31వ తేదీ బిజినెస్‌ ముగింపు సమయానికి ఈ విలువ రూ.10,000 కోట్లకు తగ్గింది‘ అని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడిరచింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు