Friday, May 3, 2024

పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు..

తప్పక చదవండి
  • 22 మంది మృతి, 50 మందికిపైగా గాయాలు..
  • ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌, షాజాద్‌పూర్- నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆ రైలులోని 10 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను నవాబ్‌షాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రైలు ప్రమాదంపై స్థానికులు వెంటనే స్పందించారు. పట్టాలు తప్పిన రైలు బోగీల్లోని ప్రయాణికులను బయటకు తీశారు. పలువురిని కాపాడారు. ధ్వంసమైన బోగిల్లో పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు పాకిస్థాన్‌ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు