Saturday, October 12, 2024
spot_img

ఎన్నికలలో భాగంగానే ఈ పర్యటనలు

తప్పక చదవండి
  • ఏం అభివృద్ధి చేశారో చూపించాలి
  • డబల్‌ బెడ్‌ రూమ్‌ల విషయంలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విద్యా, వైద్యాన్ని నిర్వీర్యం చేశారు
  • మంత్రి పర్యటనను ఎద్దేవా చేసిన కాంగ్రెస్‌ నాయకులు వీర్లపల్లి శంకర్‌

షాద్‌ నగర్‌ : ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనలో భాగంగా గురువారం నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలు మరియు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా షాద్నగర్‌ నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే త్వరలో పూర్తి చేస్తామని సభా ముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే మంత్రి పర్యటనలో భాగంగా శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వీర్లపల్లి శంకర్‌ మాట్లా డుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో భాగంగానే ఈ పర్యటనలని ఎద్దేవా చేశారు నిన్న ప్రారంభించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఏ ఒక్క పేదవాడికి అందలేదని అన్నారు మీరు నిజమైన లబ్ధిదారులకు ఇస్తే వాళ్ల సమాచారం మాకెందుకు ఇవ్వడం లేదని అన్నారు.నియోజకవర్గంలోని ఆరు మండలలో ఎంతమందికి డబల్‌ బెడ్‌ రూమ్‌ఇండ్లు ఇచ్చారో చెప్పాలని అన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా 2018 లో కొత్తూరు బైపాస్‌ నుండి అన్నారం వై జంక్షన్‌ వరకు నాలుగు లైన్లతో నిర్మిస్తామన్న రోడ్డు ఇంతవరకు పూర్తి కాలేదు, మీరే నిర్మిస్తామన్న లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు ఎందుకు నిర్మించడం లేదో చెప్పాలన్నారు చటాన్‌ పల్లి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఏమైందని, ఆరు మండలాలలో సంక్షేమం ఎక్కడ జరిగిందో చూపించాలన్నారు ఆశా వర్కర్ల సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు సిద్దాపూర్‌ గ్రామంలో 350 ఎకరాలు నిరుపేదల నుంచి లాకున్న భూమి అని దానిని పేదలకు పంచకుండా ఐటీ హబ్‌ ఎలా కడతారని అన్నారు కోట్లల్లో ధరలు పలుకుతున్న భూములను సెజ్‌ ల పేరు మీద నిరుపేదల నుంచి 5, 10 లక్షలకు కొనుగోలు చేసి కార్పొరేట్‌ సంస్థలకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తే మరి ఎందుకు ప్రతిపక్షాలకు భయపడి ముందస్తు అరెస్టు చేపిస్తున్నారని అన్నారు ఏది ఏమైనా ఈసారి కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు