Wednesday, May 15, 2024

వ్యాపార సంస్థలు, వినియోగదారుల మధ్య నమ్మకం ఉండాలి..

తప్పక చదవండి
  • బీ – 20 వ్యాపార సదస్సులో సూచించిన ప్రధాని మోడీ..
  • క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలి..
  • సమగ్ర ఏకీకృత వైఖరి ఎంతో అవసరమన్న మోడీ..
  • భారత్ లో ప్రతిభావంతమైన యువత ఉంది..
  • భారతదేశానికి సమ్మిళితత్వ విజన్ ఉంది..
  • అందుకే జీ – 20 సదస్సుకు ఆఫ్రికా దేశాలను ఆహ్వానించాం : మోడీ..

న్యూ ఢిల్లీ : వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడటం కన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి సమగ్ర, ఏకీకృత వైఖరి ఉండాలన్నారు. బీ20 వ్యాపార సదస్సును ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడారు. వినియోగదారుల పరిరక్షణ గురించి మనం మాట్లాడగలమా? అది సకారాత్మక సంకేతాలను పంపిస్తుంది, వినియోగదారుల హక్కుల సమస్యలను పరిష్కరిస్తుంది. మనం వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించాలి’’ అని మోదీ చెప్పారు. అంతర్జాతీయ వినియోగదారుల పరిరక్షణ దినోత్సవాన్ని ఏదో ఓ రోజున జరుపుకోవాలని సూచించారు.

క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర, ఏకీకృత వైఖరి అవసరమని తెలిపారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్నపుడే లాభదాయక మార్కెట్ సుస్థిరమవుతుందని చెప్పారు. ఇతర దేశాలను కేవలం మార్కెట్లుగా పరిగణించడం వల్ల ప్రయోజనం ఉండదని, అలా చూడటం వల్ల ఉత్పత్తిదారులైన దేశాలకు నేడో, రేపో హాని జరుగుతుందని తెలిపారు. అభివృద్ధిలో అందరినీ సమాన భాగస్వాములను చేయడం మన ముందు ఉన్న మార్గమని చెప్పారు. మరింత ఎక్కువగా వినియోగదారుల కేంద్రంగా వ్యాపారం జరిగే విధంగా వ్యాపారాన్ని తీర్చిదిద్దడం ఎలాగో మనమంతా చెప్పగలమా? అని ప్రశ్నించారు.

- Advertisement -

వ్యాపారస్తులు ప్రజలంతా పండుగ ఉత్సాహంతో ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చారు.. ఈసారి భారతదేశంలో పండుగ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం అయ్యింది.. చంద్రుని ఉపరితలంపైకి చంద్రయాన్ – 3 దిగినందుకు ఈ సంబరాలు జరుగుతున్నాయి.. భారతదేశ లూనార్ మిషన్ విజయవంతం అవడంలో ఇస్తో ప్రధానపాత్ర పోషించింది.. అంతేకాకుండా భారతదేశంలోని పరిశ్రమలు, ఎం.ఎస్.ఎం.ఈ.లు, ప్రైవేట్ కంపెనీలు కూడా ముఖ్యమైన పాత్రను పోషించాయి.. ఇది సైన్స్, పారిశ్రామిక రంగం సాధించిన విజయం.. అన్నారు ప్రధాని మోడీ.. భారతదేశానికి సమ్మిళితత్వ విజన్ ఉందని, అందుకే జీ – 20 సదస్సుకు ఆఫ్రికా దేశాలను ఆహ్వానించామని మోడీ చెప్పారు.. భారతదేశంలో ప్రతిభావంతులైన యువత అత్యధికంగా ఉందన్నారు. ఇండస్ట్రీ 4.0 సమయంలో డిజిటల్ విప్లవానికి భారత దేశం నాయకత్వం వహిస్తోందన్నారు. సామర్థ్యాన్ని సౌభాగ్యంగా, అడ్డంకులను అవకాశాలుగా, ఆకాంక్షలను విజయాలుగా మార్చే సత్తా వ్యాపార రంగానికి ఉందని చెప్పారు. వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా; స్థానిక లేదా అంతర్జాతీయ స్థాయిలో జరిగేది అయినా, ప్రతి ఒక్కరినీ అభివృద్ధి చేస్తుందన్నారు. సమర్థవంతమైన ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో భారత దేశ పాత్ర గురించి మాట్లాడుతూ, గ్లోబల్ సప్లయ్ చైన్‌ను ప్రపంచం ఒకే విధంగా చూడటం సాధ్యం కాదన్నారు. అవసరమైనపుడు అంతరాయాలు ఏర్పడే సరఫరా వ్యవస్థను సమగ్ర వ్యవస్థగా పిలవగలమా? అని ప్రశ్నించారు. ఈ సమస్యకు పరిష్కారం భారత దేశమేనని చెప్పారు. భారత దేశంలో హరిత ఇంధనంపై దృష్టి సారించామన్నారు. సౌర విద్యుత్తు, ఇంధన రంగాల్లో సాధించిన విజయాలను గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కూడా పునరావ‌‌ృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అన్ని దేశాలను కలుపుకొనిపోవాలని భారత దేశం కోరుకుంటోందని, అంతర్జాతీయ సౌర కూటమి రూపంలో అది ప్రతిఫలిస్తోందని చెప్పారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు