Wednesday, May 15, 2024

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదు

తప్పక చదవండి
  • ఎన్నికల్లో ఓట్లు పొందాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం
  • తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదు
  • తెలంగాణ ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదని.. ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం రానున్న సందర్భంలో.. అమిత్‌ షా పాల్గొననున్న కార్యక్రమాలు, మేనిఫెస్టో విడుదలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు వరుసగా రానుండడంతో శనివారం నుంచి ఆ పార్టీ ప్రచారం హోరెత్తనుంది. తదుపరి కార్యాచరణపై బీజేపీ మీడియా సెంటర్‌లో పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పాల్గొని.. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదని.. ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రచారంలో భాగంగా దేశ ప్రధానిమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, యోగి అదిత్య నాథ్‌, హిమంత విశ్వ శర్మ సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆర్‌ కుటుంబ, అవినీతి పాలనను ప్రజలకు తెలియజేస్తామని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టో క్షేత్ర స్థాయిలోకి వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎన్ని హామీలు ఇచ్చినా.. 75 ఏళ్లలో ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు పొందాలనే తప్ప.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దోపిడీ చేసి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయన్నారు. తెలంగాణను ఆలస్యంగా ఇవ్వడం వల్లే ఆత్మ బలిదానాలు చేసుకున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం చెబుతున్నారు. తెలంగాణ ఇస్తానని వెనకడుగు వేయడంతోనే.. పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకున్నారని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా సరే.. దేశంలో డబ్భై అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే హామీలు నెరవేర్చిన దాఖలాలు లేవు. మోసం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ నైజం. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికపై, గ్యారెంటీలపైన ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా అంచనాలు వేయాల్సిన పని లేదు. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలనే దుర్మార్గపు ఆలోచన తప్ప.. ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన చిత్తశుద్ది లేదని అన్నారు. ధరణి పేరుతో ఈ రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. గ్రామంలోని రెవెన్యూ రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని.. అనేక భూములను అన్యాక్రాంతం చేసిందని విమర్శించారు. దీనివల్ల చాలా మంది వ్యక్తులు భూములు కోల్పోయారని అన్నారు. బాధితులు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇది కోట్లాది రూపాయల కుంభకోణమేనని బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని.. మేనిఫెస్టోలో సైతం దీనిని పొందు పరుస్తామని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు