Sunday, May 19, 2024

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు..

తప్పక చదవండి
  • మీకు అండగా తెలంగాణ ప్రజలు ఉన్నారు – ఓయూ జాక్ బాలలక్ష్మీ
  • జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశం..

జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు స్థానిక ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మంగళంపల్లి రాజు అధ్యక్షతన నిరుద్యోగులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా రాజకీయ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విద్యార్థులు, నిరుద్యోగులు ఎవ్వరు కూడ ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ ప్రజలు మీకు అండగా పోరాడతారని ఏకగ్రీవంగా తీర్మానించింది.. ఈ రౌండ్ టేబుల్ సమావేశంను జనగామ గద్దర్ పాటతో ప్రారంభించగా ఈ సందర్భంగా ఓయూ జేఏసీ బాలలక్ష్మీ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడి ఆత్మబలిదానం చేసుకున్న విద్యార్థుల ఆత్మ గోషించేలా ఈ రోజు బీ.ఆర్.ఎస్. పార్టీ కేసీఆర్, కేటీఆర్ లు వ్యవహరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో మొదటగా దగాపడ్డది విద్యార్థులే అని, గ్రూప్ – 2 వాయిదాపడి ఆత్మహత్య చేసుకున్న ప్రవలికను కేటీఆర్ అవమానించినందుకు వెంటనే మంత్రి పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.టి.పీ. నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఇందుర్తు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వై.ఎస్. షర్మిల ప్రతివారం ఒకరోజు నిరుద్యోగుల కోసం పోరాడిందని, నిరుద్యోగులకు అండగా వై.ఎస్.ఆర్.టి.పీ. ఉంటుందని, బీ.ఆర్.ఎస్. ను గద్దె దించడమే నిరుద్యోగులకు బరోసా అని తెలిపారు. బీ.ఎస్.పీ. నియోజకవర్గ ఇంచార్జి జరిపోతుల కుమార్ మాట్లాడుతూ.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తమ పార్టీ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారని, బహుజన రాజ్యంలో నిరుద్యోగులు ఉండరని తెలిపారు. జేఏసీ సలహాదారులు, కవి, రచయిత రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినంక విద్యార్థులు చనిపోతుంటే ఇది మన ప్రభుత్వమా..? లేక ఆంధ్రోళ్ల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఎం.ఆర్.పీ.ఎస్. జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఇంటికి భారమయ్యరన్న అభద్రతాభావంలో ఉన్నారని, వారిని ప్రభుత్వం మోసం చేసిందని, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ప్రజలు ఒడిస్తారని హెచ్చరించారు. కేయూ జేఏసీ నాయకులు ఆసర్ల సుభాష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక ఉరి వేసుకుని చస్తున్నారనీ, నోటిఫికేషన్ వచ్చినా ఉద్యోగం రాదనే భావనలో విద్యార్థులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కస్ సంస్థల డైరెక్టర్ బండి దీప్తి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం 2018లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేస్తామనే విధంగా ఎన్నికలకు వెళుతున్నారని, బీ.ఆర్.ఎస్. పార్టీకి నిరుద్యోగులు బుద్ది చెపుతారని హెచ్చరించారు. ఎం.ఎస్.పీ. జిల్లా నాయకులు భాస్కర్, టి.జీ.వీ.పీ. జిల్లా ప్రధాకార్యదర్శి తుంగ కౌశిక్, ఎం.ఆర్.పీ.ఏ. జిల్లా అధ్యక్షుడు గండి ప్రవీణ్, ఐ.వీ.ఎస్.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రా ప్రవీణ్, జనసేన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్, బీ.ఎస్.పీ. జిల్లా నాయకులు కుమార్, టి.జీ.వీ.పీ. పట్టణ అధ్యక్షుడు వేంపటి అజయ్, దీకొండ హరీష్ అభిలాష్, నర్సింగ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు