Saturday, May 4, 2024

అక్రమ షెడ్డును కూల్చివేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

తప్పక చదవండి
  • ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎఫెక్ట్‌

సికింద్రాబాద్‌ : గత నెల 29వ తేదీన ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ దినపత్రికలో ‘‘అక్రమ షెడ్లకు అడ్డాగా సికింద్రాబాద్‌ సర్కిల్‌’’ అని ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు సికింద్రాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మెట్టుగూడ డివిజన్‌ విజయపురి కాలనీలో వనిత ఫార్మా కళాశాల ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ షెడ్డు ను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ రజిత హెచ్చరించారు. కూల్చివేతలలో సెక్షన్‌ ఆఫీసర్‌ సరిత, న్యాక్‌ ఇంజినీర్‌ ప్రకాష్‌, చైన్‌ మెన్‌ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు