Sunday, May 5, 2024

చరిత్ర సృష్టించే అవకాశం ఇక్కడి ప్రజలది

తప్పక చదవండి
  • కెసిఆర్‌ను ఓడిస్తే దేశమంతి ఇటే చూపు
  • నిజామాబాద్‌ ప్రచారంలో రేవంత్‌ పిలుపు

నిజామాబాద్‌ : సీఎం కేసీఆర్‌ రాసిపెట్టుకో కాంగ్రెస్‌ పార్టీకి 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లపాటు కుటుంబం అంతా కలసి దోచుకుందని అన్నారు. వారికి ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ను ఓడిరచడం ద్వారా నిజామాబాద్‌ ప్రజలు చరిత్ర సృష్టించాలన్నారు. బుధవారం నాడు ఉమ్మడి జిల్లాలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లాలో మాట్లాడుతూ…‘డిసెంబర్‌ 3వ తేదీన లెక్క చూసుకో కేసీఆర్‌.. 80 కంటే ఒక్కటి తక్కువున్నా ఏ చర్యకైనా సిద్ధం. కేసీఆర్‌కు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఇక్కడ పోడు భూముల సమస్య తీరలేదు. గిరిజనులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తీరుస్తానని పదేళ్లయినా తెరువలేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇక్కడి రైతులు ఓడిరచారు. ఈ ప్రాంత రైతుల సమస్యలను బీఆర్‌ఎస్‌ నేతలు పట్టించుకోలేదు. బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేసి వారి హక్కులను కాలరాశారు. అయ్య బక్కోడు.. కొడుకు తిరుగుబోతోడు. ప్రజలను ఆదుకోవాలంటే ఒక్కరూ ముందుకు రారు.ఎర్రజొన్న రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయలేదు. పసుపు బోర్డు తెస్తానన్న గుండోడు ఎక్కడికో పోయిండు. నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత యువకులు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని అడిగారు. అధిష్ఠానం నన్ను కామారెడ్డిలో పోటీ చేయమని ఆదేశించింది‘ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎవరు గెలుస్తారో రాష్ట్ర ప్రభుత్వం అదే వస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మేడిగడ్డ మూడేళ్లకే కుంగి పోయింది. విూరు కట్టిన ప్రాజెక్టులు చూపించి బీఆర్‌ఎస్‌ నేతలు ఓట్లు అడగాలి. మేము కట్టిన శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు చూపించి ఓట్లు అడుగుతాం. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం. బీఆర్‌ఎస్‌ అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానని కేసీఆర్‌ ఊహాలోకంలో ఉంచారు. ఆయన మాత్రం 150 రూముల బంగ్లా కట్టుకున్నాడు. బోధన్‌ ఏసీపీకి చెప్తున్నా.. నీ నౌకరి నువ్వు చెయి.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలాగా చేయకు.. డిసెంబర్‌ 3వ తేదీ తర్వాత ఏమైతదో చూడు కేసీఆర్‌‘ అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు