- ఎన్నికల కోడ్ పట్టించుకోకుండా కాంట్రాక్టర్ ఆగమేఘాలమీద పనులు
- తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో 25 విధ్యుత్ స్థంభాలు పాతడానికి హరితహారం చెట్ల నరికివేత
మేడ్చల్ మల్కాజిగిరి : ఎన్నికల కోడ్ వచ్చిందంటే అప్పటి వరకు కొనసాగుతున్న అన్ని అనుమతులు పొందిన పనులు పూర్తి చేయడాలనికి అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్ వచ్చిందంటే నూతనంగా పథకాలు ప్రకటించడం కాని, నూతన పనులు చేపట్టడం కాని చేయకూడదనే నియమం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ పదే పదే చెబుతున్నా.. అవేమి పట్టనట్లు కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో యదేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేని నూతన పనులు కొనసాగుతున్నాయి.
యదేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన :
మేడ్చల్ జిల్లా, శామీర్‌పేట మండలం, తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బిట్స్ పిలాణి కాలనీలో సుమారు 25 విధ్యుత్ స్థంభాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులు కావొస్తున్నా.. తూంకుంట మున్సిపాలిటీ అధికారులకు గానీ, విద్యుత్ శాఖ అధికారులకు గానీ ఎలాంటి సమా చారం, అనుమతులు లేకుండా బడా నాయకుల బినామీ కాంట్రాక్టర్లు యదేచ్ఛగా చక చకా పనులు కానిచ్చేస్తుండటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది.. అంతే కాకుండా స్థానికులు అధికారులకు సమాచారం అందించినా, స్పందిం చకపోవడం ఎన్నిల నియమావళిని అధికారులు పాటిం చకపోవడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి మల్లారెడ్డియే ఏపిస్తుండు :
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నూతన పనులు చేయోద్దని నిబంధన ఉన్న విషయంపై విధ్యుత్ స్థంబాలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారని అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా.. మంత్రి మల్లారెడ్డి పేరు చెప్పడం విస్మయానికి గురిచేసింది. మంత్రిగా ఉండి ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పలువురుని ఆగ్రహానికి గురిచేస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.
హరితహారం చెట్లు హాంఫట్ :
తూంకుంటు మున్సిపాలిటీ 3వ వార్డు బిట్స్ పిలాణీ ప్రాంతంలో మంత్రి మల్లారెడ్డి సొంత నిధులతో అధికార పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుని అండదండలతో నూతనంగా విధ్యుత్ స్థంభాలను ఏర్పాటు చేయడానికి హరితహారం కార్యక్రమంలో నాటి ఎంతో పెద్దగా, ఏపుగా పెంచిన చెట్లను నరికి వేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతే కాకుండా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా కూడా సొంత నిధులతో మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు పనులు చేయించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని పలువురు విధ్యా వేత్తలు వాపోతున్నారు.
తూంకుంట కమిషనర్ జైతురామ్ నాయక్ వివరణ :
తూంకుంట మున్సిపాలిటీ నుండి విద్యుత్ శాఖ నుండి ఎటువంటి అనుమతి పొందలేదని, ఎన్నికల కోడ్ ను ఉల్లంగిస్తే ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు.