- వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం సతీమణి శోభ
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ దర్శించుకున్నారు. మంగళవారం వేవజామున అర్చన సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పిం చుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని ఆమెకు బహూకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం తిరుమల చేరకున్న సీఎం కేసీఆర్ సతీమణి.. సోమవారం రాత్రి అక్కడే బస చేశారు.