టీటీడీ జేఈవో సదా భార్గవి స్విమ్స్ ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్,వైస్ ఛాన్సలర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్విమ్స్(శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ వెంగమ్మ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. డైరెక్టర్, వీసీగాకూడా కొనసాగుతున్న ఆమె స్థానంలో సదా భార్గవిని ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, వీసీగా నియమిస్తూ టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో డాక్టర్ వెంగమ్మ నుంచి సదా భార్గవి బాధ్యతలు స్వీకరించారు.