Friday, May 3, 2024

సూర్యాపేట కాంగ్రెస్ కిరణం పటేల్ రమేష్ రెడ్డి..

తప్పక చదవండి
  • ప్రజలంటే ప్రాణం.. సేవే ఆయనకు పరమార్ధం..
  • సమాజానికి ఏదైనా చేయాలన్నదే ఆయన లక్ష్యం..
  • సూర్యాపేట పట్టణ సమస్యల పరిష్కారం వైపే ఆయన అడుగులు..
  • మహా ధర్నాతో మా నాయకుడు అనిపించుకున్న నేత..
  • మన మనిషి, మంచి మనిషి అని కితాబు
    అందుకున్న అరుదైన నాయకుడు..
  • పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు సునాయాసం
    అంటున్న ప్రతి వర్గం..
  • కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టాలంటున్న నియోజకవర్గ ప్రజానీకం..

హైదరాబాద్ : అరుదైన వ్యక్తిత్వం కలిగిన నాయకులుండటం ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావించవచ్చు.. ఎందుకంటే ప్రజల అవసరాలను ప్రతిక్షణం గమనిస్తూ వాటి పరిష్కారానికి అనునిత్యం శ్రమిస్తూ.. ప్రజల్లో మమేకమై తిరుగుతూ.. నేనున్నానే భరోసా కలిగించే నాయకులు చాలా తక్కువుగా ఉంటారు.. అలాంటి కోవకే చెందుతారు సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి.. సేవా తత్పరత నెలకొన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన తనలో ఆ లక్షణాలని పుణికిపుచ్చుకున్నారు.. నిరాడంబర జీవితం.. మంచిని కోరుకునే వ్యక్తిత్వం.. పార్టీలో అన్ని విషయాలపట్ల అవగాహన కలిగిన సామర్ధ్యం.. అనుకున్న పనిని ఏవిధంగా నైనా నెరవేర్చాలని ధృడ సంకల్పం.. ఆయనకు సొంతం.. లెక్కలేని సేవా కార్యక్రమాలతో దూసుకుపోతూ.. ఎంతోమందికి ధైర్యాన్ని, అంతులేని అభయాన్ని ఇస్తూ.. తాను పనిచేస్తున్న పార్టీకి తిరుగులేని పేరును ఆపాదించి పెడుతూ.. ముందుకు సాగిపోతున్నారు పటేల్ రమేష్ రెడ్డి.. ఆయన జీవిత గమనం ఎందరికో ఆదర్శం.. పార్టీ ప్రతిష్టతకు మూలం.. ఆయన చేపట్టే ప్రతీ కార్యక్రమం వెనుక ఒక పరమార్ధం దాగి ఉంది.. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉంటుంది.. సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్లగలిగే తెగువ ఉంది.. అందుకే ఆయన అందరికీ ప్రీతిపాత్రుడు కాగలిగారు.. పాద యాత్ర చేపట్టినా.. మట్టిలో నడిచినా, ధర్నాలు చేపట్టినా ఒక ప్రత్యేకత అక్కడ కనబడుతుంది.. అందుకే సూర్యాపేట నియోజకవర్గ ప్రజానీకం ఆయనను కోరుకుంటోంది.. అధిష్టానం ఆయనకు టిక్కెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని లక్షల గొంతుకలు ఎలుగెత్తి చాటుతున్నాయి.. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి..? అన్నది..

పటేల్ రమేష్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.. ఆయన అడుగులు సాగిన తీరు.. పార్టీలో ఆయన నెరపిన కార్యక్రమాలు.. ప్రజల్లో ఆయన సంపాదించుకున్న సుస్థిర స్థానం లాంటి ఆసక్తిని కలిగించే విశేషాలను వరుస కథనాల ద్వారా మీముందుకు తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు