Saturday, May 18, 2024

షారూఖ్‌ ఖాన్‌ డబుల్‌ దమాకా! రూ.1000 కోట్ల క్లబ్‌లో జవాన్‌

తప్పక చదవండి

ముంబై : షారుఖ్‌ఖాన్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’ వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా రూ.650 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఈ ఏడాది పఠాన్‌ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన షారుఖ్‌ తాజాగా ‘జవాన్‌’ సినిమాతో మరోసారి అదే మ్యాజిక్‌ చేశాడు. కేవలం 19 రోజుల్లోనే ‘జవాన్‌’ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. షారుఖ్‌ఖాన్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, భాషల్లో ఒకేరోజు విడుదలైంది. ఇక మొదటి రోజు రూ.144 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన ఈ సినిమా.. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేసింది. విడుదలైన నాలుగోరోజు అయితే ఏకంగా రూ.156 కోట్లు వసూలు చేసింది. ఇక వీకెండ్‌ వస్తే ఇప్పటికి ఈ సినిమాకు సంచలన వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పఠాన్‌ తర్వాత ‘జవాన్‌’ కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో.. ఒకే ఏడాదిలో వరుసగా రెండుసార్లు ఈ అరుదైన ఘనత సాధించిన హీరోగా చరిత్ర షారుఖ్‌ఖాన్‌ సృష్టించాడు. మరోవైపు ఈ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ దర్శకుడిగా అట్లీ అరుదైన ఘనత సాధించాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు