Wednesday, July 24, 2024

తెలంగాణలో సమాచార హక్కు చట్టానికి తూట్లు..

తప్పక చదవండి
 • అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్ విషయంపై దరఖాస్తు చేసిన ఎంపి..
 • సమాధానం ఇవ్వకపోవడంతో హైకోర్టు లో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి..
 • సదరు కేసులో వ్యాజ్యం వేసిన నన్నూరి నర్సి రెడ్డి..
  తరఫున కేసు వాదించిన న్యాయవాది మామిండ్ల మహేష్..
 • ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆవేదన..
 • ప్రజలకు అందుబాటులో లేని సెక్షన్ 4(1) బి సమాచారం..
 • డి.ఓ.పి.టి. నిబంధనలకు తూట్లుపొడుస్తూ చట్టాన్ని నీరుగార్చడమే
  ధ్యేయంగా కనిపిస్తున్న హెచ్.ఎం.డి.ఏ. వ్యవహారం..
 • హెచ్.ఎం.డి.ఏ. నిర్వాకంతో ఇబ్బందులకు గురౌతున్న దరఖాస్తుదారులు.

ప్రజా ప్రయోజనాలకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన సమాచార హక్కు చట్టానికి.. సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే తూట్లు పొడుస్తుండటం అత్యంత శోచనీయం.. చివరికి న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా వారి తీరులో మార్పు రావడం లేదు.. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి విదితమే.. ఈ వ్యవహారంపై సమాచారం అందించాలని దరఖాస్తు చేసుకున్న ఒక ప్రజా ప్రతినిధికి చుక్కలు చూపించారు సంబంధిత అధికారులు.. అసలు సహ చట్టం యొక్క ఉద్దేశ్యాలను సైతం కాలరాస్తుండటం దౌర్భాగ్యంగా పరిణమించిందని మేధావులు సైతం తమ ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నారు..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వ పథకాలు, చేస్తున్న ఖర్చులు, నివేదికలు, అధికారుల పని తీరుకు సమాచార హక్కు చట్టం, సెక్షన్ 4(1)బి ప్రకారం సంబంధిత 18 అంశాలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు సచ్చందంగా ప్రభుత్వ అధికారులు సంబంధిత కార్యాలయ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో, పారదర్శకమైన పాలన అందించడం కోసం, ప్రజలకు జవాబుదారీ తనంగా ప్రభుత్వాలు ఉండాలనే ఉద్దేశ్యంతో, ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి సమాచార హక్కు చట్టాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. సమాచార హక్కు ఛట్ఠం 2005ను అమల్లోకి తేవడం జరిగింది.. ఎవరైనా, ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో తనకు కావాల్సిన సమాచారాన్ని ఈ చట్టంలోని సెక్షన్ 6(1) ప్రకారం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంది.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు బిన్నంగా చట్టాన్ని నీరు గార్చే విధంగా అధికారులు వ్యవహరించడం.. ధరకాస్తుదారులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్షం చేయడం.. అధికారులకు చట్టం అంటే లెక్క లేకుండా పోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. హైదరాబాద్ హెచ్.ఎం.డి.ఏ. కార్యాలయంలో కోరిన సమాచారం దరఖాస్తుదారులకు అందిస్తే.. ఆ కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాలకు సంబంధించి గుట్టు బట్టబయలు అవుతుందని.. ఆ శాఖ డైరెక్టర్ అనుమతి లేకుండా ఏ దరఖాస్తుదారుడికైనా ఎలాంటి సమాచారం ఇవ్వద్దని డైరెక్టర్.. కార్యాలయ అధికారులను హెచ్చరించినట్లు స్థానిక అధికారులు కొందరు తెలిపారు.. చట్టంలో నిర్దేశించిన విధంగా సమాచారం ఇవ్వాల్సిన హెచ్.ఎం.డి.ఏ. కార్యాలయం సమాచార హక్కు చట్టానికి వ్యతరేకంగా స్వంత నిర్ణయాలు తీసుకోవడంతో.. దరఖాస్తుదారులకు తాము కోరిన సమాచారం పొందడం అందని ద్రాక్షగా మారింది.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరు అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనే చట్టంలో తెలిపినా.. సదరు చట్టాన్ని ఉల్లంఘించిన సంబంధిత అధికారులకు రూ. 25,000 జరిమానా విధించాలని నిబంధన ఉన్నా.. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా.. సహ చట్టం వచ్చి 18 సంవత్సరాలైనా.. నేటికీ హెచ్.ఎం.డి.ఏ. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం.. సహ చట్టంపై అధికారుల నిర్లక్షం తేట తెల్లం అవుతుంది.. తెలంగాణ రాష్ట్రంలో ఎం.పి. రేవంత్ రెడ్డి అవుటర్ రింగ్ రోడ్డు.. టోల్ ఆపరేటింగ్ అండ్ ట్రాన్స్ఫర్ కు సంబంధించిన విషయంపై ఐ.అర్.బి.కి. ఇచ్చిన కాంట్రాక్ట్ కు సంబంధించిన సమాచారం కావాలని తేది 14 జూన్ 2023 రోజున దరఖాస్తు చేయడం జరిగింది.. హెచ్.ఎం.డి.ఏ. అధికారులు సమాచారం ఇవ్వకుండా నిర్లక్షం వహించడంతో.. ఎం.పి. రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. ఈ యొక్క కేసు రిట్ పిటిషన్ నెంబర్ 20143 ఆఫ్ 2023 గా నమోదైంది.. కాగా ఇదే కేసులో నన్నూరి నర్సిరెడ్డి అనే వ్యక్తి ఇంప్లిడ్ అయినట్లు తెలుస్తోంది.. కాగా డీవోపీటీ మెమోరాండం నెంబర్ : 1/6/2011 – ఐ.ఆర్., జీ.ఓ.ఐ., ఎం.ఓ.పీ.పీ. జీ అండ్ పీ, డీఓపీటీ.. తేదీ : 15 ఏప్రిల్ 2013 సమాచార హక్కు చట్టానికి సంబంధించి నోడల్ ఏజెన్సీ గా ఉన్న డీవోపీటీ తేల్చి చెప్పింది..
దినేష్ త్రివేది వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఏ.ఐ.ఆర్. (1994) 4ఎస్.సి.సి. 306,314) కేసులో సమాచార హక్కు చట్టానికి సంబంధించి ప్రజాప్రయోజనాలు సంబంధించి సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉందని చట్టం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, ప్రభుత్వ అధికారుల్లో పారదర్శకత ఉండాలని, ప్రజా అధికారులు జవాబుదారి తనంగా వుండాలని అపెక్స్ కోర్ట్ స్పష్టంగా తెలియజేసింది..

- Advertisement -

నర్సిరెడ్డి తరుపున వాదించిన హై కోర్టు న్యాయవాది మామిండ్ల మహేష్ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, డి.ఓ.పి.టి. సూచించిన నిబంధనల ప్రకారం, ప్రభుత్వ అధికారులు స్వచ్ఛందంగా అధికారిక వెబ్సైట్ లో ప్రజలకు అందుబాటులో 18 అంశాలతో కూడిన సెక్షన్ 4(1)బి సంబంధించిన సమాచారం అందుబాటులో పారదర్శకంగా బాధ్యత సదరు అధికారులకు ఉందని తన వాదనలు వినిపించినట్లు తెలిసింది.. బహుళ ప్రజా ప్రయోజనాల కోసం, డి.ఓ.పి.టి. 2013లో జారీచేసిన నిభందనల ప్రకారం, స్వచ్ఛందంగా ప్రభుత్వం సత్వరమే ప్రజలకు అందుబాటులో సమాచారం ఉంచే విధంగా చూడాలని కోరినట్లు తెలిసింది.. న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వాదనలు కూడా వినాలని కేసు ఆగస్టు 4కు వాయిదా వేసినట్లు తెలిపారు.. ఇప్పటికైనా హెచ్.ఎం.డి.ఏ. చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తారా..? లేక వారి అవినీతి బట్ట బయలు కాకుండా స్వంత నిర్ణయాలే తీసుకుంటారా..? న్యాయస్థానాన్ని గౌరవించి ప్రజలకు అందుబాటులో సమాచారం ఉండేలా చర్యలు చేపడుతుండగా అన్నది చూడాలి.. చూడాలని.. హెచ్.ఎం.డి.ఏ.లో ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారికి సంబంధించిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా రాష్ట్రం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు.. చట్టబద్ధంగా సమాచారం ఇచ్చేలా హెచ్.ఎం.డి.ఏ.లో మార్పులు తేవాలని పలువురు సమాచార హక్కు చట్ట కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..

దీనిపై పిటిషనర్ నన్నూరి నర్సిరెడ్డి స్పందిస్తూ :
సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటింది.. ప్రజలకు ఉపయోగ పడే సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమాచారం.. ఒక్క ప్రజా ప్రతినిధి సమాచారం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లి పొందే సమాచారం కాదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సమాచార హక్కు చట్ట దరఖాస్తుదారుల సమస్య అని తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఉన్న దాఖాస్తులపై సమాచారం ఇస్తే ఎంత అవినీతి బట్టబయలు అవుతుందో అని ఉద్దేశ్యపూర్వకంగా సమాచారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. సమాచార హక్కు చట్టంలో స్వచ్ఛందంగా అధికారులు పారదర్శకంగా, ప్రజలకు జవబుదారీగా చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించి సెక్షన్ 4(1) బిలో అధికారిక వెబ్ సైట్ లో సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా పెట్టాలన్నారు.. ఇది ఒక్క నాయకుడి సమస్య కాదు..మొత్తం తెలంగాణలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందే ప్రతి పౌరుడి సమస్య అని తెలిపారు.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ మేల్కొని చట్టం పారదర్శకంగా అమలు అయ్యేలా చూసి, తక్షణమే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమాచారం ఆన్ లైన్ వెబ్ సైట్ లో పెట్టాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.. హెచ్.ఎం.డీ.ఏ. లోనే సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే.. అందులో ఏ మేరకు అవినీతి దాగి ఉందో అర్ధం చేసుకోవచ్చు.. సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చట్టం పారదర్శకంగా అమలుచేసి ప్రతి పౌరుడికీ సమాచారం అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు