Wednesday, October 16, 2024
spot_img

రాబోయే ఎలక్షన్స్ లో ఓట్ల కోసం బియ్యం మీద ఆంక్షల డ్రామాలు..

తప్పక చదవండి
  • తీవ్ర విమర్శలు చేసిన గుండ్రాతి శారదాగౌడ్..

బియ్యం ఎగుమతి మీద మోఢీ సర్కార్ ఆంక్షలు ఎందుకు? ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? బైడన్ తో సమావేశం అనంతరం ఈ ఆంక్షలు పెట్టాడు మోడీ.. ఈ నిషేధం వెనుక లోగుట్టు ఏమిటి? రాబోయే ఎలక్షన్స్ కోసం ఈ డ్రామా కాదు కదా? ఆ తరువాత సానుభూతి కోసం ఆంక్షలు ఎత్తి వేసినట్లు నటిస్తే మోఢీకీ దేశం మీద, విదేశాల్లో ఉన్న భారతీయుల మీద ప్రేమ ఉన్నట్లుగా భావించి బీజేపీకి ఓట్లు పడతాయనే ప్లాన్ ఉండొచ్చు అన్నారు బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు : బీసీ మహిళా సంక్షేమ సంఘం, హైకోర్టు సీనియర్ న్యాయవాది గుండ్రాతి శారదాగౌడ్. తెలంగాణాలో ధాన్యపు రాసి ఉంది, కేంద్రం ఎందుకు తీసుకోవడం లేదు? రాష్టాల మీద ఆంక్షలు పెట్టారు.. కేంద్రం కొనదు, రాష్టాలను అమ్ముకోనివ్వదు, ఇదెక్కడి చోద్యం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తుంది.. ఆర్థిక, రాజకీయ, సామజిక విద్యా, మహిళా, నిరుద్యోగ, ఉద్యోగ, బ్యాంకు, విద్యుత్, ప్రతి రంగం పట్ల మినిమం అవగాహన లేదు వివేకం అంతకన్నా లేదు.. మూర్ఖత్వం తప్ప ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దాం అనే ధ్యాస కనపడం లేదు.. ఓట్లు, సీట్లు, ఎలక్షన్స్, అందుకోసం తన దోస్తుల ద్వయానికి లాభం చేయడం, తద్వారా తమ పార్టీకీ ఫండ్ వచ్చే మార్గం ఇది తప్ప ఈ దేశం పట్ల ప్రజల పట్ల కించిత్తు ప్రేమ, అభిమానం లేనే లేదు అన్నారు శారదాగౌడ్.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన విధానం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలు, చివరికి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికీ తెచ్చేలా ఉన్నాయి మోఢీ సర్కార్ విధానాలు..
ఒక వైపు ఆర్థిక నిపుణులు దేశం నలభై ఏండ్లు వెనక్కి పోయిందని, మానవహక్కులు కాలరాస్తున్నారని అంటున్నారు.. మోడీ, బైడన్ తో లోపల మీటింగ్ లో ఉంటే వైట్ హౌస్ బయట సీనియర్ జర్నలిస్ట్ నిరసన వ్యక్తం చేసాడు.. ఇది మన దేశానికి అగౌరవం మోఢీజీ.. ఇది కనిపిస్త లేదా? ఇంతకు ఈ దేశాన్ని ఏమి చేద్దాం అనుకుంటున్నారు.. ఈ “మో షా ” ద్వయం.. అన్నపూర్ణ నా భారతదేశం బియ్యం ఎగుమతికీ ఎలాంటి ఇబ్బంది లేదు.. కరువు లేదు, ఐనా తాత్కాలిక, కృత్రిమ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించి మోఢీ ప్రపంచంకు ఏమి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు.. ఇన్నాళ్ళు ఉన్నది, ఉంచుకున్న భారతదేశం పరువు పోతుంది యాద్ రకో మోఢీజీ, ఏ గలత్ హై…తక్షణమే బియ్యం ఎగుమతుల మీద ఆంక్షలు తీసివేయాలి అన్నారు గుండ్రాతి శారదాగౌడ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు