అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ కు 24.5 కోట్ల రూపాయలు.. సుందరీకరణ కోసం సాంక్షన్ చేయడం జరిగినది అందులో భాగంగా ఆదివారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.. అందులో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించిన ప్రోగ్రాంను లైవ్ ద్వారా చూడడం జరిగినది.. వారిచ్చిన సందేశాన్ని విచ్చేసిన భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే మంత్రి. ఎమ్మెల్యే రాకపోవడం అభివృద్ధి పట్ల వారి శుద్ధ తెలియ వస్తుందని, నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం ప్రకటన చేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమం చేపట్టాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి, కె.వీ.ఎల్.ఎన్. రెడ్డి, మాజీ చైర్మన్ లు వేమల్ల సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల సుధాకర్ పాల్గొనగా.. ఓట్ ఆఫ్ థాంక్స్ చెబుతూ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త, మాట్లాడుతూ.. జనగామ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 24.5 కోట్ల రూపాయలు జనగామ స్టేషన్ మంజూరు చేయడం పట్ల జనగామ జిల్లా పక్షాన భారత ప్రధాని నరేంద్ర మోడీ కి అభినందనలు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారితో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..