Sunday, May 12, 2024

యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్దీకరించాలి..

తప్పక చదవండి
  • యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ కవితకు విజ్ఞప్తి..

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని యూనివర్సిటీ కాంటాక్ట్ టీచర్స్ జాక్ ఎమ్మెల్సీ కవితని వారి స్వగృహంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారు చెప్పిన విషయాలను విన్న కవిత ఎన్నో సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మిమ్ములను క్రమబద్ధీకరించేలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని, సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఉన్నత విద్యను పట్టించుకోకపోవడం వల్ల మీరు కాంట్రాక్టు అధ్యాపకులుగా జీవితాన్ని గడపాల్సివస్తుందని అందుకే మన ముఖ్యమంత్రి ఎంతోమంది కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్న నేపథ్యంలో మీ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించే విధంగా నా వంతు కృషి చేస్తానని, త్వరలో మీరు తీపి కబురు వింటారని జేఏసీ నాయకులకు తెలియజేశారు. కవితను కలిసిన వారిలోయూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ జాక్ చైర్మన్ డాక్టర్ పరుశురాం, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బైరి నిరంజన్, వర్కింగ్ చైర్మన్ ధర్మ తేజ, కో చైర్మన్ తేందర్ రెడ్డి, నవీన్ రావ్, మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ పరందాము, వైస్ చైర్మన్ బాలకోటి, జె. వెంకటేశ్వర్లు, విజయ కాంత్, ఎం. రమేష్, డాక్టర్ నిర్మల జ్యోతి, డాక్టర్ అనిత, డాక్టర్ కవిత, డాక్టర్ అర్జున్ ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు