Sunday, June 23, 2024

సహజ,ఆర్థిక వనరుల దోపిడికి అడ్డుకట్ట వేయాలి

తప్పక చదవండి
  • జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
  • ఒక ప్రకటనలో వివరాలు తెలిపిన పందుల సైదులు..

తెలంగాణ ప్రాంతంలో సహజ,ఆర్థిక వనరుల దోపిడీ తీవ్రంగా జరుగుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.ఆచార్య జయశంకర్ సార్ అమరుడైన నాటి నుంచి తెలంగాణ విద్యావంతుల వేదిక విధిగా స్మారకోపన్యాసాలు నిర్వహిస్తూ వస్తుంది. ఆ కొనసాగింపులో భాగంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు ను హైదరాబాద్ లోని మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. మొత్తంగా మూడు సెషన్ లుగా ఈ సదస్సు కొనసాగింది.మొదటి సెషన్ కు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అధ్యక్షత వహించగా హాజరైన వక్తలు జయశంకర్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది..

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ, ఆర్థిక వనరుల దోపిడీ విపరీతంగా జరుగుతుందని అన్నారు. సహజ వనరుల దోపిడి ఏ విధంగా జరిగిందో,జరుగుతుందో విద్యావంతులు తమకు తాము ప్రశ్న వేసుకోకపోతే ముంధు కు పోవడం సాధ్యం కాదు అన్నారు.ఈ సమాజానికి చెందిన సహజ వనరులు ఎవరి చేతిలో ఉన్నాయి.?తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి.? వీటిని తెలంగాణ సమాజానికి చెందెటట్లు ఏట్లా చేయాలి.! దోపిడి చేస్తున్న వారు తెలిసిపోయింది.దోపిడీ కి గురవుతున్న వారిని గుర్తించలేనంత స్థాయికి సమాజాన్ని నెట్టివేసినం.ఆ వైపు గా గుర్తించే బాధ్యత ను కొనసాగించాలన్నారు. దోపిడీదారులను దోపిడీదారులకు వత్తాసు పలుకుతున్న వారిని దోషులుగా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి అన్నారు. ప్రజల ఆస్తులను అప్పనంగా దోపిడీదారులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంటున్నం. కొట్లాడిన వారు భాగం కాకుంటే ముందుకు ఏలా పోతది తెలంగాణ.కొట్టినవారే బాగమవుతే పున:నిర్మాణమా.!.పాలకులు మన యాసను బాషను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు.సేవ చేసేవారు వ్యాపారం చేయడం తో రాజ్యంగంలోని ఆదేశిక సూత్రాలు ఉల్లంఘించబడుతున్నాయి అన్నారు.పున:నిర్మాణం అంటే ఆకాశ హర్మియాలు కాదు కధా.! ప్రాధమికంగా జరగాల్సిన మార్పు ఏమైనా జరిగిందా.! అంటే జరుగలేదు.మార్పు రావాల్సిన చోట మార్పు రావడం లేదు అన్నారు.విద్యావంతుల వేదిక ప్రస్తుత కర్తవ్యం పౌర సమాజం ఏలా నడుచుకోవాలో ప్రణాళిక చేస్తే బాగుంటదని సూచించారు.చర్చలు,సంభాషణల ద్వారా ముందుకు పోతే ఒక నిర్థిష్ఠమైన కార్యచరణ కు అవకాశం ఉంటదనే ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

కల్చర్ పేరు తో రాజకీయాలు శాసిస్తున్నారు :
ప్రొ:అజయ్ గుడవర్తి జె.ఎన్.యూ న్యూడీల్లీ
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ఈ దేశంలో మతం పేరుతో రాజకీయాలు శాసిస్తున్నారని జే.ఎన్.యూ న్యూఢిల్లీ కి చెందిన ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి అన్నారు. కేంద్రంలో ఉన్న పాలకులు సహనాన్ని కోల్పోయి అశాంతి అలజడులను సృష్టిస్తున్నారన్నారు.భారతదేశంలో అసహనం తో ఆర్ఎస్ఎస్ బిజెపి మూలాలను రక్షించినట్లుగా నటిస్తుందన్నారు.సంస్కృతిని ప్రత్యామ్నాయ ఉద్యమాలు సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల పాలకవర్గాలు సంస్కృతిని తమ ఎజెండాలో చేర్చుకున్నందుకు వారికి ఈ రోజు ఒక లెజిటిమసీ వచ్చింది అన్నారు.కల్చర్ ని ప్రత్యామ్నాయ ఉధ్యమాలు సీరియస్ గా తీసుకొని అందులో భాగంగా కామన్ స్కూల్ విధానాన్ని ఎజెండా గా చేర్చాలన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ కల్చర్ ను వాడుకుంటూ దానిని ఐడెంటిటీగా ప్రోజెక్ట్ చేసి ప్రజలలో ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు.ఇది మొత్తం కూడా రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసమే అన్నారు.

కామన్ ఎజెండా తో ముందుకు పోదాం
ఐ.ఏ.ఎస్ ఆకునూరి మురళి :
ఐ.ఏ.ఎస్ ఆకునూరి మాట్లాడుతూ బిజెపి దుర్మార్గపు విధానాలు,బి.ఆర్.ఎస్ మోసపూరిత విధానాలు మితిమీరిపోతున్నాయన్నారు.ఇప్పటికే సమయం చాలా వృధా ఐతుంది కాబట్టి,శత్రువు బలంగా ఉన్నాడు,తెలివిగా ఉన్నాడు కాబట్టి దానిన్ని ఢీ కొట్టాలి అంటే కామన్ మినిమం ప్రోగ్రాం ఎజెండా ప్రిపేర్ చేసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలిసిన అవసరం ఉందన్నారు.ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ముందుకు సాగితేనే లక్ష్యం చేరుకోగలమన్నారు.

పౌర సమాజం పాత్రం కీలకం: ప్రొ: హర గోపాల్
ప్రొ:హర గోపాల్ మాట్లాడుతూ ఇన్ని త్యాగాలు చేసిన తెలంగాణ లో ఫలితాలు ఆశాజనకంగా లేవు.కర్ణాటక తరహలో పౌర సమాజం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ వచ్చాక అంతా బాగుంటదని ఏమి అనుకోలే.అంతర్గత దోపిడీ సాగుతుది ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని అనాడే అనుకున్నం.ఇంతకంటే పెద్ద ఉధ్యమం అవసరం ఉంటదని జయశంకర్ గారి మాట్లాడిన మాటలను గుర్తు చేసారు.ప్రజా ఆకాంక్షలు పట్టించుకోకపోతే ఉద్యమాలే పాలకుల విధానాల మార్పు కు నాంది అన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రుపొందించిన ప్రత్యామ్నాయ విధానాలను ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. ఆచరణలో పెట్టే విధంగా పాలకులను వెంటాడాలన్నారు.పాలనలో ఒక మాఫియా అంతర్లీనంగా ఏలుతుందన్నారు.అధికార పార్టీ ల నేతలు తెలంగాణ వచ్చిన తర్వాత గుట్టలను కూడా వదలడం లేదు అన్నారు.వ్యవస్థ ను మొత్తం కలుషుతం చేసి చట్టబద్దమైన సంస్థలన్నింటిని అచేతనంలోకి నెట్టి వేసారన్నారు.పౌర హక్కుల సంఘం జోలికి సమైక్య పాలకులు కూడా రాలేదన్నారు. కేసీఆర్ మాత్రం నిషేధం విధించడం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన బహుమానం అన్నారు.మొత్తం గా ప్రాధమిక హక్కులు సైతం కాల రాయబడ్డాయన్నారు.

మరో ఉధ్యమం అవసరం: సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్రమూర్తి
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం అవసరమని సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్ర మూర్తి అన్నారు. తెలంగాణ ఆగమయింది అనుకున్నా వాళ్ళందరూ ఒక వేదిక కిందికి రావాలిసిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యల వెలుగులు ఒక కామన్ ఎజెండా రూపొందించుకొని ముందుకు సాగవలసిన ఆవశ్యకత తెలంగాణ పౌర సమాజంపై అత్యవసరంగా ఉందన్నారు.

ప్రొ:మురళి మనోహర్ మాట్లాడుతూ పీపుల్స్ ఎజెండా తో సామాజిక న్యాయ ప్రాతిపదికగా ఉధ్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొ:వెంకట్ నారాయణ మాట్లాడుతూకార్పొరేట్ లో ఉన్న పెద్ద శక్తులు, పాలకులు కలిసి దారుణంగా దోపిడి చేస్తున్నారన్నారు.అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి.ఐక్యంగా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సు జరుగుతుండగానే ప్రజా యుద్ద నౌక అమరుడైనాడనే వార్త తెలియడంతో వారికి వేదిక సంతాపం ప్రకటిస్తూ నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో జె.ఎన్టియూ ప్రొఫెసర్ వినయ్ బాబు, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి,ప్రొ:రమా మేల్కేటో, ప్రొఫెసర్ పద్మజా షా,ప్రొ:రమ, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి, వీక్షణం వేణుగోపాల్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి అరుణోదయ విమలక్క,మట్టి మనిషి పాండు రంగారావు,నర్సింహారెడ్డి,తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డేగల సారయ్య,జంపాల విశ్వ,డి.ఎస్.ఎస్.ఆర్ క్రిష్ణ,పందుల సైదులు,తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు