Friday, May 17, 2024

మియాపూర్‌లో దేవేందర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్‌ నాయర్‌ను అరెస్ట్

తప్పక చదవండి

మియాపూర్ కాల్పుల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లో దేవేందర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్‌ నాయర్‌ను అరెస్ట్ చేశారు. రితీష్‌ నాయర్‌ నెలక్రితం వరకు సందర్శిని ఎలైట్ మేనేజర్‌గా పని చేశాడు. అమ్మాయి విషయంలో రితీశ్‌ నాయర్‌, దేవేందర్‌ మధ్య గొడవ జరుగడంతో.. రితీష్‌ నాయర్‌పై దేవేందర్‌ సందర్శిని ఎలైట్‌ యజమానికి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో తన ఉద్యోగం పోయిందని దేవేందర్‌పై రితీష్‌ నాయర్‌ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మదీనాగూడ సందర్శిని ఎలైట్‌లో మేనేజర్ దేవేందర్‌పై రితీశ్‌ నాయక్‌ ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. దేవేందర్‌ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన నిందితుడి కోసం ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడు రితీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని కోలోకతా వాసిగా గుర్తించారు. హోటల్ సిబ్బంది స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు.. కాల్పుల్లో మృతి చెందిన దేవేందర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు