Friday, November 1, 2024
spot_img

ప్రజా భవన్ లో ప్రజా దర్బార్‌

తప్పక చదవండి
  • భారీగా తరలివచ్చిన ప్రజలు
  • అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్‌
  • ధరణి, భూ సమస్యలపై వినతుల వెల్లువ
  • మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్న ప్రజలు
  • అంతకుమించిన తృప్తి ఏముంటుంది ప్రజా దర్బార్‌పై రేవంత్‌ ఆసక్తికర ట్వీట్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ లో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు. సామాన్య
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు సామాన్యులు తరలి వచ్చారు. తమ సమస్యలను వివరించారు. ధరణి సమస్యలు, తమ భూములు నేతలు కబ్జాలు చేశారని, డబుల్‌ బెడ్‌ రూంలు ఇప్పించాలని, అడ్వకేట్‌ రైట్స్‌ యాక్ట్‌ రూపకల్పన చేయాలని, టీచర్‌ 317 జీవో ఇవ్వాలని కోరారు. అలాగే సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడానికి కొంత మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు వచ్చారు. కాగా ప్రజాదర్బార్‌ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజా దర్భార్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ మొదలైంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను సీఎం రేవంత్‌, మంత్రులు స్వీకరించారు. మరోవైపు ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు చేరుకున్నారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు