Saturday, May 18, 2024

వడివడిగా అడుగులు వేస్తోన్న ప్రజ్ఞాన్‌..

తప్పక చదవండి
  • మరో వీడియోను షేర్‌ చేసిన ఇస్రో..
  • సెకనుకు సెం.మీ. వేగంతో కదులుతున్న ప్రజ్ఞాన్..
  • నెట్టింట్లో వైరల్ గా మారిన ఇస్రో షేర్ చేసిన వీడియో..

బెంగళూరు :
చంద్రయాన్‌ – 3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం మరో ఆసక్తికర వీడియోను షేర్‌ చేసింది. ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి రోవర్‌ ప్రజ్ఞాన్‌ వడివడిగా చంద్రుడి ఉపరితలం విూద అడుగుపెడుతున్న దృశ్యాలను పంచుకుంది. ఈ మేరకు ఎక్స్‌లో (ట్విటర్‌) ఒక ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను ల్యాండర్‌ విక్రమ్‌లోని కెమెరా బంధించింది. ‘ చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌ – 3 ల్యాండర్‌ నుంచి రోవర్‌ కిందికి ఇలా దిగింది‘ అని ఇస్రో క్యాప్షన్‌ ఇచ్చింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం పై విక్రమ్‌ ల్యాండర్‌ ను దించింది. ఇక జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తాజాగా సోషల్‌ విూడియాలో పోస్టు చేసింది. వీడియోలో ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపి.. సెకనుకు ఒక్కో సెం.విూ వేగంతో వడివడిగా బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు