Thursday, May 16, 2024

ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్ష వాయిదా..

తప్పక చదవండి
  • ఈనెల 11 నుంచి 14 కు వాయిదావేసి టి.ఎస్.పీ.ఎస్.సి.
  • హాల్ టికెట్స్ వారం ముందే డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
  • అభ్యర్థులు గమనించాలన్న అధికారులు..

హైదరాబాద్ :
తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్య, సాంకేతిక విద్య కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పదింది. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఐతే కొన్ని కారణాల వల్ల ఈ పరీక్షను నవంబరు 14కి వాయిదా వేసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెల్లడించింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్ష వాయిదా వేసిన సంగతి గ్రహించవల్సిందిగా కోరింది. ఈ పరీక్ష నవంబర్ 14వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని కమిషన్‌ తన ప్రకటనలో తెలిపింది. ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి సరిగ్గా వారం రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించాలని, అపోహలు, వదంతులను నమ్మొద్దని సూచించింది.

నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగాధిపతి డా. వివిమల్లికకు ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌’ (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) సంస్థ కీలక ప్రాజెక్టు అప్పగించింది. తెలంగాణ ఇ-గవర్నెన్స్‌పై పరిశోధనకు సంబంధించి ‘మైనర్‌ రీసెర్చి ప్రాజెక్టు’ను ఈ సంస్థ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రీసెర్చ్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుల భర్తీ కోసం అసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించారు. రీసెర్చ్‌ అసిస్టెంట్ పోస్టుకు సామాజిక శాస్త్రంలో కనీసం 55 శాతం మార్కులతో పీహెచ్‌డీ, ఎంఫిల్, పీజీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుకు ఏదైనా సోషల్‌ సైన్స్‌ విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబ‌రు 13లోపు నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దరఖాస్తులను నేరుగా సమర్పించాలని సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు