Sunday, May 5, 2024

సఖ్యత లేని రాజకీయాలు

తప్పక చదవండి
  • ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..?
    ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు
    మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గంలో మూడు పార్టీల ప్రతినిధులతో ప్రజలు అయోమయంలో ఉన్నార నడానికి ఎటువంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఎంపీ, బిఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే,బిజెపి పార్టీకి సంబంధిం చిన కార్పొరేటర్లు ఉండడంతో నియోజకవర్గం పరిధిలోని కొన్ని డివిజన్‌ లలో ప్రజలు పడరాని గోసపడుతున్నారు.వినాయక నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఓల్డ్‌ సఫిల్గుడా లోని విజ్ఞాన్‌ ఆర్కేడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంలో సుమేధ బాలిక సంఘటన తర్వాత వర్షం నీరు సజావుగా పోవడానికి బాక్స్‌ డ్రైనేజ్‌ ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్లాన్‌ తో కూడిన ప్రతిపాదన జిహెచ్‌ఎంసికి సమర్పించిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.గురువారం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శంకుస్థాపన గాను నాలుగు అడుగుల వెడల్పు ఉన్న పైపులను తీసుకొచ్చి తవ్వకాలు చేయడం సరికాదని విజ్ఞాన్‌ ఆర్కేడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు అన్నారు.

వినాయక్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని జరుగుతున్న పనులకు మౌలాలి డివిజన్‌ కార్పొరేటర్‌ వచ్చి కొబ్బరికాయ కొట్టడం కూడా విడ్డూరంగా ఉందని అన్నారు.ఇక్కడ పార్టీల ప్రతినిధుల్లో సఖ్యత లేక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని,గతంలో నీరు సజావుగా పోవడానికి 70-30 వాటాతో నాలా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు బాక్స్‌ డ్రైనేజ్‌ కాకుండా నాలుగు అడుగుల పైప్‌ లైన్లు వేస్తే అపార్ట్మెంట్‌ కు ప్రమాదం జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్ని పార్టీల నాయకులను కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.మున్సిపల్‌ ఏఈ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు,నేరేడ్మెట్‌ సిఐ నాగరాజు లు,అపార్ట్మెంట్‌ కు రక్షణ గోడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అని కమిటీ సభ్యులు మీడియాకు తెలియజేశారు.కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేష్‌ ,జీ వీ కే దత్తు, పూలపల్లి రాము యాదవ్మ, రామచంద్ర రావు,బిక్షపతి, సుజ్ఞాదం, మూర్తి నరసింహ చారి శరత్‌, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు