Friday, May 17, 2024

గంజాయికి యువత దూరంగా ఉండాలి

తప్పక చదవండి
  • విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా..
  • సైబర్‌ నేరాల పట్ల యువత అప్రమతంగా ఉండాలి..
  • ఖమ్మం రూరల్‌ ఏసీసీ బస్వారెడ్డి
    నేలకొండపల్లి : గంజా యి అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపనున్నట్లు ఖమ్మం రూరల్‌ ఏసీపీ జీ.బస్వారెడ్డి తెలిపారు. నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ ను శుక్రవారం ఆకస్మి కంగా తనిఖీ చేసిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా విలేకర్ల తో మాట్లాడుతూ సబ్‌ డివిజన్‌ లో గంజాయి రవాణా ను సహించేది లేదని హెచ్చరించారు. గంజాయి విక్రయించే, సేవించే వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయాల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి కి సంబంధించి ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల యువత రహదారుల పై ఘర్షణలు పడుతూ, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. అలాంటి వారిని ఉపేక్షిచేంది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం సమాజంలో సైబర్‌ నేరాల పట్ల యువత అప్రమతంగా ఉండాలని కోరారు. గ్రామాలల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. నేర రహిత సమాజం కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో కూసుమంచి సీఐ కె.జితేందర్రెడ్డి, నేలకొండపల్లి ఎస్సై బి సతీష్‌ పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు