కరీంనగర్ : కేరళకు అయ్యప్ప భక్తులు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. మంగళవార నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ…అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా..?హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. తబ్లీగీ జమాత్‌ను ఇస్లామిక్ దేశాలు నిషేధించాయి. ఆ సంస్థని రాష్టాన్రికి ఎలా అనుమతి ఇస్తారు. కొవిడ్‌ను రాష్టాన్రికి తెచ్చిందే తబ్లీగీ జమాత్ సంస్థనే. తిరుపతిలో పులులు వస్తే భక్తులకు కర్రలు ఇస్తారా…? తిరుమలకు భక్తులు రాకుండా కుట్రలు చేస్తున్నారు‘ అని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.