Friday, July 26, 2024

కప్పల తక్కెడ గా ప్రస్తుత రాజకీయాలు..

తప్పక చదవండి

దేశ రాజకీయాలు ప్రస్తుతం కప్పల తక్కెడగా మారాయి. అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు.ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కొందరు ఎప్పుడు ఏ పార్టీలో జంప్ చేస్తారో ఎవరు ఎందులో ఉంటారో ఎవరు ఏ మాట ద్వారా ప్రజల్లో నోరు జారుతారో అర్థం కాని పొజిషన్లో ప్రస్తుత రాజకీయ పార్టీలు ఉన్నాయి.రాజనీతిని పక్కనపెట్టి రాజకీయ విలువలు మర్చిపోయి అందరికీ పబ్లిసిటీ రోగం పట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడటం ఇప్పుడు వచ్చిన కొత్త మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఈ రకంగా పబ్లిక్ ఫిగర్ గా మారిపోతే రాజకీయంగా ఎదగొచ్చు ప్రజాప్రతినిధిగా మారొచ్చు అనుకుంటున్నారు కాబోలు. రాజకీయమంటే ఏమాత్రం అవగాహన లేని కొందరు ఇప్పుడున్న పరిస్థితులను గమనించి తాము అంతకుముందు అనుకున్న ఉద్దేశాలను మర్చిపోయి గబాలున ఉన్నపలంగా రాజకీయాల్లోకి వచ్చి ఓ పెద్ద నాయకుడి సమక్షంలో కండువా కప్పుకొని నాలుగు ఫ్లెక్సీలు వేయించుకుంటే చాలు ఇదే పెద్ద రాజకీయం అన్నట్లుగా అయిపోయింది నేటి రాజకీయం. ప్రజల గుణగణాలు స్థితిగతులు అవసరాలు ప్రస్తుతం ప్రజలకు ఏం కావాలి ఎలాంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారు. ఎటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కావాలనుకుంటున్నారన్న ఆలోచనలు పక్కన పెట్టేసి పెద్ద నాయకుడు ఎటు వెళ్తే,తాము అటువైపే అన్నట్లుగా ఉన్నారు.పెద్ద నాయకుడి మోచేతి నీళ్లు తాగి ఎదుగుదాం అనుకునే వాళ్లే తప్ప సొంతంగా తమకంటూ ప్రజల్లో నికార్శైన ప్రజా సేవకుడు అనిపించుకోవాలని జిజ్ఞాస ప్రస్తుతం 80 శాతం నాయకులలో కనిపించడం లేదు.తమ పై నాయకుడు పార్టీ మారితే తాము మారతాం ఏ పార్టీలోకి వెళితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఎందులోనైతే పేరుకు పేరు డబ్బుకు డబ్బు హోదాకు హోదా లగ్జరీ బతుకులు ఉన్నాయో అందులో జంపు జిలాని అన్న ఆలోచన తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే ముందు చూపు పోకడలో ఇప్పుడు వస్తున్న కొత్త తరం నాయకులకు ఎవరికి లేనట్లుగా కనిపిస్తుంది.వీళ్లు పెట్టే హడావుడికి పాత తరం నాయకులు కూడా తమ అనుభవాన్ని మర్చిపోయి ఓపిక లేక పార్టీలు మారి చేతులు కాల్చుకోవటము లేక పెదవులు విరుచుకోవడం బురదలో పడ్డామని సంగతి తెలుసుకొని
యరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాము అన్న చందంగా రాజకీయాల్లో కొనసాగుతు గడబిడ పడే పరిస్థితి నెలకొన్నది.ఓ పెద్దాయన చెప్పినట్టు వెనకటి రాజకీయాలు (స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆ తర్వాత 20 ఏళ్ల వరకు) ప్రస్తుతం లేవు అప్పట్లో ఎన్నికల హడావుడి ఇప్పుడున్నంతగా ఉండేది కాదట. పెద్దగా డబ్బు ఖర్చు అయ్యేది కాదట.ప్రజలు ఒక పార్టీకి ఒక వ్యక్తికి విలువ ఇచ్చేవారు.ఆ వ్యక్తి ఆ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చాయో అవి కచ్చితంగా నెరవేర్చేందుకు నూటికి నూరు శాతం ప్రయత్నించేవారట. ఎవరైతే పోటీ దారుడు ఉన్నారు ఆయనకు మద్దతు ఇచ్చే ఆ పార్టీ పదిమంది పెద్దలు పావలా ఆశించకుండా పార్టీ కోసం రాజకీయ విలువల కోసం అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కృషి చేసే వారిని తెలిసింది.ఎన్నికలు మరో 10 రోజులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకసారి నియోజకవర్గం అంతా కలియతిరిగి గ్రామంలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులకు కలిసి మాట తీసుకొని వచ్చేవారట అంతే.ఆ గ్రామంలో ఆ వార్డులో ఆ పట్టణంలో ఉన్న ఓట్ల సంఖ్య ఉదాహరణకు 2000 ఉన్నాయి అనుకుంటే అందులో కచ్చితంగా ఓ 50 ఓట్లు అటు ఇటు పోతే మిగతా ఓట్లన్నీ అనుకున్న అభ్యర్థికే పడేవట.ఏవి అప్పటి రాజకీయాలు ఏవి అప్పటి రాజనీతి పద్ధతులు.అప్పట్లో వెన్నుపోటు విధానాలు తక్కువ (1980 నాటి వరకు) ఇప్పుడున్నవన్నీ వెన్నుపోటు పాలిటిక్సే.అన్నా మేము ప్రత్యేకంగా సర్వే చేశాం.తప్పకుండా మీరే గెలుస్తారు అని చెప్పేటోడు ఒకడు.మాటలతో ఆకాశానికి ఎత్తేదోకడు.ప్రజల్లో ఏమాత్రం పేరు లేకుండా ముఖ పరిచయాలు లేకున్నా సదరు అభ్యర్థిని పొగడ్తలతో ముంచే తేవాడు మరొకడు.నిన్నే గెలిపిస్తాం,నీకే మద్దతిస్తాం.నీతోటే మేముంటాం.అని చెప్పి తీరా నెక్క మూమెంట్ లో నియోజకవర్గ అభ్యర్థి ని నట్టేట ముంచి తాము ఒడ్డుకు నిలబడి అభ్యర్థిని వెక్కిరించే రాజకీయాలు ఇప్పుడు కల్లారా చూస్తున్నాము.ఇలాంటి నికృష్టపు అమానవీయ డబ్బు రాజకీయాలు పోయి,తిరిగి పాతకాలపు రోజులు రావాలని కోరుకుందాం.అదేదో సినిమాలో నాయకుడు లేని సమాజాన్ని సృష్టించాలని డైలాగు వాడుతారు. నిజంగా నాయకుడు లేని సమాజాన్ని మనం కాకపోయినా మన భావితరాలకు అందించేందుకు మనతోటే పునాదులు వేసే ప్రయత్నం చేద్దాం. అందుకు నేను నా వంతుగా నాకు చేతనైంది చేసే మొదటి ప్రయత్నం ఈ అక్షర మాలిక

  • కందుకూరి యాదగిరి
    సీనియర్ పాత్రికేయులు, సూర్యాపేట
    9640282050
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు