యుగాలు మారినా
తరాలు మారినా
మానవ మృగాలు మారలేదు
రాజ్యాలు మారినా
ప్రభుత్వాలు మారినా
పాలకుడి హింస మారలేదు
- Advertisement -
నాగరికతలు మారినా
సంస్కృతులు మారినా
నగ్న హృదయాల
ఊరేగింపులు మారలేదు
అమ్మతనంపై చెలరేగే
రాక్షసత్వం మారలేదు
అవనిపై ఆధిపత్యం మారలేదు
ఆత్మరక్షణ ఆయుధాలుగా
పోరాట ఫిరంగుల్లా
మారాల్సింది మనమే తల్లులారా!
(మణిపూర్ మహిళా ఉదంతం సాక్షిగా)
ది.21.07.2023
విశ్వ జంపాల
న్యాయవాది,
తెలంగాణ విద్యాంతుల వేదిక
7793968907