Sunday, September 15, 2024
spot_img

భాగోద్వేగానికి గురైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

తప్పక చదవండి
  • కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు
    స్వీకరణ సందర్భంగా సంచలనం సృష్టించిన సంఘటన..
  • నిక్కచ్చిగా, సూటిగా, ధైర్యంగా తన అభిప్రాయం
    వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి..
  • తన రాజకీయ భవిష్యత్తును సైతం లెక్కచేయకుండా
    మాట్లాడిన వైనం..
  • కిషన్ రెడ్డి సమక్షంలోనే తన మనసులోని మాటను
    బయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి..
  • రాజగోపాల్ రెడ్డి మానసిక ఘర్షణను అభినందిస్తున్న
    బీజేపీ అభిమానులు, కార్యకర్తలు..

రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు.

కిషన్‌రెడ్డి సభలో … బండి సంజయ్ జపం చేశారని, బండి సంజయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బండి‌ సంజయ్ కారణంగానే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచింది బండి సంజయ్ నాయకత్వంలోనే అని కొనియాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో సమిష్టిగా పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు పేరు చెప్పుకుని బతుకుతున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారూ మీరు చెప్పేది అక్షర సత్యం.. నిజం నిప్పు లాంటిది… కానీ పెద్ద పెద్ద ద్రోహులు ఆడే ద్రోహపు చదరంగంలో.. నిజాయితీపరులు ఎప్పటికైనా సమిధలు కాక తప్పదు.. ముఖ్యంగా హిందీ కోసం పోరాటం చేసి కార్యకర్తలు.. అంటూ రాజగోపాల్ రెడ్డి అభిమానులు తమ అభిప్రాయాలను సోషియల్ మీడియా ద్వారా పంచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు